చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు ఎంత సాధారణంగా జరిగిపోతున్నాయో, విడాకులు కూడా అంతే సాధారణంగా ఇచ్చేస్తున్నారు. ఎంతో ఇష్టపడి పెళ్లిళ్లు చేసుకున్న జంటలు.. చిన్న చిన్న విభేదాలకే విడిపోతున్నారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు మీడియా మూడ్ను సంచలనం ఆరోపణలు చేసుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. తాజాగా ఒక భోజ్‌పురి నటుడు తన భార్యతో కలిసి జీవించడం తనకు ఇష్టం లేదని మీడియా ముందు చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విసివరాల్లోకి వెళితే.. భోజ్‌పురి సూపర్ స్టార్ పవన్ సింగ్ భోజ్‌పురిలో పలు సినిమాలలో నటించి స్టార్ హోదాను సంపాదించుకున్నాడు. ఇక పవన్, కొన్నేళ్ల క్రితం నీలం సింగ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తరవాత వారి మధ్య మనస్పర్థల కారణంగా ఆమె మార్చి 8, 2015న ముంబైలోని ఒక ఫ్లాట్‌లో ఆత్యహత్య చేసుకుంది. తర్వాత కొద్ది రోజులకు పాపులర్ నటి అక్షరా సింగ్‌తో పవన్ సింగ్ రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు హల్‌చల్ చేశాయి.
మార్చి 7, 2018న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన జ్యోతిసింగ్‌ను వివాహం చేసుకుని అందరిని షాక్‌కు గురి చేశాడు పవన్ సింగ్. ఇక ఇటీవల తన రెండో భార్య జ్యోతి సింగ్ నుంచి తనకు విడాకులు కావాలని అరా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ పెట్టాడు పవన్.. ఈ నేపథ్యంలోనే తన భార్యపై మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు. నాకు తనతో జీవించడం ఇష్టం లేదు. డివోర్స్ కావాలి.’ అనిచెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలిపి జ్యోతి సింగ్, ఆమె తరుపున న్యాయవాది మాట్లాడుతూ “జ్యోతికి ఇష్టం లేకుండా రెండు సార్లు అబార్షన్ చేయిచాడు. పెళ్లి అయిన దగ్గరనుంచి ఆమెను నిత్యం వేధిస్తూ ఉండేవాడు. భర్త ఆగడాలను భరించాలని ఆమె ప్రస్తుతం పుట్టింట్లో తల్లిదగ్గర ఉంటుంది. రేపు విడిపోయాక ఆమె బతకాలంటే విడాకులతో పాటు ఆమెకు భరణం కూడా ఇప్పించాలని కోరారు”. మరి ఈ కేసులో కొడుతూ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.