టాలీవుడ్ లో ఈసారి సంక్రాంతి రసవత్తరంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నమూడు సినిమాలు సంక్రాంతి పోరులో ఢీ అంటే ఢీ అంటున్నాయి. జనవరి 7 న ‘ఆర్ఆర్ఆర్’ తో సంక్రాంతి మొదలు కాగా 13 న ‘భీమ్లా నాయక్’, 14 న ‘రాధేశ్యామ్’ రిలీజ్ కానున్నాయి. ఇక జక్కన్న ఎన్ని ప్రయోగాలు చేసినా ‘భీమ్లా నాయక్’ మాత్రం తగ్గేదేలే అంటూ సంక్రాంతి బరిలోకి దిగుతోంది. పాన్ ఇండియా సినిమాల మధ్య రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై దర్శ నిర్మాతలకు అంత కాన్ఫిడెంట్ ఏంటి అనేది ప్రస్తుతం అందరిని వేధిస్తున్న ప్రశ్న. పవన్ – రానా ల పవర్ ఫుల్ కాంబో, కథపై నమ్మకం అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఏది ఏమైనా ‘భీమ్లా నాయక్’ మాత్రం సంక్రాంతికి రావడం పక్కా కాబట్టి మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసేశారు.
ఇక ఇప్పటికీ ఈ సినిమా రన్ టైమ్ ని లాక్ చేసినట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి ఇందులో స్పెషల్ సాంగ్స్, ఇంట్రడక్షన్ సాంగ్స్, అనవసరమైన సీన్స్ ఏమి లేకపోవడంతో ఈ సినిమా రన్ టైమ్ ని 2 గంటల 20 నిమిషాలకు లాక్ చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇలా రన్ టైమ్ లాక్ చేయడం వలన సినిమా సుత్తి లేకుండా సాగిపోతుందని, త్వరగా ప్రేక్షకులకు కథ కనెక్ట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
