Site icon NTV Telugu

“భీమ్లా నాయక్” ప్రీమియర్లు కన్ఫర్మ్… రన్ టైం ఎంతంటే?

bheemla nayak

‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి ఇతర విడుదలకు మార్గం సుగమం చేస్తూ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాడు ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానున్నట్టుగా ప్రకటించారు. కోవిడ్ కారణంగా పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలోకి రాలేదు. అది వేరే కథ అనుకోండి ! ఇక ఇప్పుడు “భీమ్లా నాయక్” ప్యాచ్‌వర్క్ భాగాలను పూర్తి చేసి, ప్రకటించిన తేదీనే విడుదలకు సిద్ధంగా ఉన్నారని వినికిడి.

Read Also : అంత బోల్డ్ అవసరమా? దీపికా పదుకొనెపై ట్రోలింగ్

ఇక సినిమా రన్ టైమ్ గురించి మరికొన్ని ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ‘భీమ్లా నాయక్’ కేవలం 2 గంటల 12 నిమిషాల రన్ టైమ్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే “అయ్యప్పనుమ్ కోషియం” దాదాపు 3 గంటల పాటు నడుస్తుంది. 50 నిమిషాల షో టైమ్‌ను కత్తిరించడం గమనార్హం. అలాగే “భీమ్లా నాయక్”లో ఒరిజినల్‌లో లేని చిన్న రొమాంటిక్ ట్రాక్, నిత్యా మీనన్‌తో ఒక పాటను కూడా తీస్తున్నారు. వాస్తవానికి “అయ్యప్పనుమ్ కోషియుమ్‌”లో ఎక్కువ రన్ టైమ్, స్లో నేరేషన్ వంటివి ఉన్నాయి. అందుకే “భీమ్లా నాయక్” మేకర్స్ దానిని స్ఫుటంగా, స్పష్టమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సినిమా రన్ టైంను ఇలా తగ్గించారట.

ఇక ఈ సినిమా ఫిబ్రవరి 24న యూఎస్ఏ లో ప్రీమియర్లకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమా విడుదలను ఇక మేకర్స్ ఆలస్యం చేసే ఆలోచనలో లేరన్న విషయం స్పష్టమవుతోంది. ఇది పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. థమన్ స్వరపరచిన పాటలు ఇప్పటికే దుమ్మురేపిన విషయం తెలిసిందే.

Exit mobile version