Bheemla Nayak : ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న “భీమ్లా నాయక్”లో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదలకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈరోజు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాల్సి ఉంది. సాయంత్రం 8 గంటలకు ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నట్టుగా చెప్పడంతో మెగా అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే అందరికీ షాకిస్తూ తాజాగా ‘భీమ్లా నాయక్’ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
Read Also : Chiranjeevi : మాఫియా డాన్‌గా మెగాస్టార్
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
“ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి. ఆయన మృతికి గౌరవ సూచకంగా #Bheemlanayak ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగదు” అంటూ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. దీంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా నిరాశపడిపోయారు. తరువాతైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా? ట్రైలర్ సంగతేంటి ? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Our deepest condolences to the family & friends of AP Minister Mekapati Goutham Reddy garu on his sudden demise. As a mark of respect, the pre-release event of #BheemlaNayak won’t be happening today!
— Sithara Entertainments (@SitharaEnts) February 21, 2022
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!