Site icon NTV Telugu

Bheemla Back On Duty: మనల్ని ఎవడ్రా ఆపేది ఇక్కడ..

pawan kalyan

pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా నటించిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించింది.  సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ నటించగా .. రానా సరసన సంయుక్త మీనన్ నటించింది. ఇక ఈ సినిమా కు థమన్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచిన సంగతి తెల్సిందే.. లాలా భీమ్లా సాంగ్ ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే ఉంది.

ఇక తాజగా మేకర్స్ మరో సాంగ్ ని రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు.  భీమ్లా బ్యాక్ ఆన్ డ్యూటీ అనే పేరుతో ఈ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ర్యాంప్ లిరిక్స్ తో అదరగొట్టేశారు. రోల్ రైడా ఊర మాస్ లిరిక్స్.. టాలీవుడ్ సింగర్స్ మెస్మరైజ్ వాయిస్, థమన్ మాస్ మ్యూజిక్ తో ఈ సాంగ్ అభిమానులను ఫిదా చేస్తోంది. భీమ్లా నాయక్ పాత్రను తెలుపుతూ సాగిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. మధ్యలో మనల్ని ఎవడ్రా ఆపేది ఇక్కడ అంటూ పవన్ వాయిస్ తో.. రానా, పవన్ మేకింగ్ వీడియోస్ తో ఈ సాంగ్ అదిరిపోయింది.

Exit mobile version