Site icon NTV Telugu

“ఆర్ఆర్ఆర్” ట్రైలర్ చూశాక చెర్రీ, తారక్ రియాక్షన్… వీడియో వైరల్

RRR

డిసెంబర్ 9న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడంతో దేశవ్యాప్తంగా “ఆర్ఆర్ఆర్” మ్యానియా స్టార్ట్ అయ్యింది. గత రెండు మూడు రోజుల నుంచి వివిధ నగరాల్లో ప్రెస్ మీట్‌లకు హాజరు అవుతూ మేకర్స్ దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు రాజమౌళితో పాటు చరణ్, తారక్, అలియా కూడా ఈ ప్రెస్ మీట్ లలో పాల్గొని మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే అసలు ఈ ఇద్దరు హీరోలూ ట్రైలర్ చూశారా ? చూస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ట్రైలర్ చూసిన మన స్టార్స్ రియాక్షన్ ప్రైస్ లెస్ గా ఉంది. ఈ వైరల్ వీడియోలో చరణ్, తారక్ కలిసి ట్రైలర్ ను వీక్షించారు. ట్రైలర్ పూర్తవ్వగానే ఇద్దరూ కలిసి ఒక్కసారిగా జక్కన్నను కౌగిలింతలతో కట్టి పడేశారు.

Read Also : “పుష్ప” వేడుక వేదిక వద్ద ఉద్రిక్తత

రాజమౌళి మాగ్నమ్ ఓపస్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా… బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగన్, అలియా భట్, కోలీవుడ్ నటుడు సముద్రఖని, శ్రియ, హాలీవుడ్ నటులు ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “ఆర్ఆర్ఆర్”ను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇక “ఆర్ఆర్ఆర్” 2022 జనవరి 7న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ పాన్ ఇండియా మూవీ IMAX, 3D, డోల్ బై సినిమా ఫార్మాట్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

Exit mobile version