Site icon NTV Telugu

Bhediya: అంతా ఓకేనా… నువ్వు ఏదో ఒకటి చెప్పు పుష్ప!

Allu

Allu

Varun Dhawan: ‘కాంతార’ భారీ విజయం తర్వాత గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నుండి రాబోతున్న సినిమా ‘తోడేలు’. వరుణ్ ధావన్, కృతీసనన్ జంటగా నటించిన హిందీ హారర్ – కామెడీ మూవీ ‘భేడియా’కు తెలుగు అనువాదం ఇది. ఈ నెల 25న హిందీ, తమిళ భాషలతో పాటు తెలుగులోనూ ఇది విడుదల అవుతోంది. తెలుగు సినిమాను అల్లు అరవింద్ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్, పాటలు వ్యూవర్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇది సమ్ థింగ్ స్పెషల్ మూవీగా ఉండబోతోందనేది ప్రేక్షకులకు అర్థమైపోయింది. తాజాగా ఈ మూవీలోని ‘అంతా ఓకేనా… ‘అనే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ పాటను వరుణ్ ధావన్, అభిషేక్ బెనర్జీ, పాలిన్ కబక్ పై చిత్రీకరించారు. అరుణాచల్‌ ప్రదేశ్ లోని నిర్మలమైన రోడ్ల గుండా వీరు కారు డ్రైవింగ్ చేస్తూ పాడే పాట ఇది. ఈ పాట ముగ్గురు స్నేహితుల మధ్య ఉన్న స్నేహాన్ని, బంధాన్ని చక్కగా చూపించింది. విశేషం ఏమంటే… సరదా సంభాషణలతో సాగే ఈ పాట మధ్యలో ‘నువ్వు ఏదో ఒకటి చెప్పు పుష్పా’ అని రావడం భలేగా అనిపిస్తుంది. ఈ ముగ్గురు మిత్రులు ఉపయోగించే పాత మారుతీ 800 కూడా నాస్టాల్జియాను రేకెత్తిస్తుంది. ఈ పాటను సచిన్-జిగర్ స్వరపరచగా, సంతోష్ హరిహరన్, వేలు, కె.జె. అయ్యనార్ గానం చేశారు. దీనికి అమితాబ్ భట్టాచార్య, యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించారు. ‘తోడేలు’ సినిమా నుండి విడుదలైన నాలుగో పాట ఇది. మరి శుక్రవారం ముందుకు వస్తున్న ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి!

Exit mobile version