పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్న పవన్.. దాన్ని కంటిన్యూ చేస్తూనే భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. గబ్బర్ సింగ్ తో పవన్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్.. ఈ సినిమాతో మరో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ఇ సంగీతం అందిస్తున్నాడు. ప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతటి హైప్ తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందా..? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకొనే అప్డేట్ ని మేకర్స్ తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ని ఇవ్వనున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోను మేకర్స్ షేర్ చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. హరీష్ శంకర్, పవన్ కాంబో అంటే ఈసారి బాక్సాఫీస్ బద్దలు బాసింగలే అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. భవదీయుడు భగత్ సింగ్ వచ్చేస్తున్నాడు. రచ్చ షురూ చేయడానికి సిద్ధం కండి అంటూ నెటిజన్స్ పవన్ ఫ్యాన్స్ కి హింట్ ఇస్తున్నారు.
