శ్రీవిష్ణు, కేథరిన్ జంటగా నటించిన ‘భళా తందనాన’లోనిది ఈ స్టిల్. వీరిద్దరి మధ్య సాగే సంభాషణను తాజా పరిణామాలకు అన్వయిస్తే… బహుశా కేథరిన్ ”ఈ వీకెండ్ లో చిరంజీవి, రామ్ చరణ్ ‘ఆచార్య’ మూవీ వస్తోంది కదా! మన సినిమానూ ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేయడం!?.. వాయిదా వేస్తే బెటరేమో” అంటుండవచ్చు. ఒకరకంగా అది నిజం కూడా. ‘భళా తందనాన’ చిత్ర నిర్మాతలు ఇటీవల ఏప్రిల్ 30న తమ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘ఆచార్య’ సినిమా ఈ నెల 29న వస్తుంటే, దానికి ఓ రోజు ముందు విజయ్ సేతుపతి, నయనతార, సమంత నటించిన ‘కన్మణి రాంబో ఖతీజా’ మూవీ వస్తోంది. అయితే అది బైలింగ్వల్ మూవీ కాబట్టి దాన్ని వాయిదా వేసుకోవడానికి ఇబ్బంది ఉంది. కానీ ‘భళా తందనాన’ను 30న విడుదల చేయాలని నిర్మాతలు అనుకోవడం సబబు కాదని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే తాజా సమాచారం ప్రకారం నిర్మాతలు రిలీజ్ విషయంలో పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ‘భళా తందనాన’ మూవీ ప్రమోషన్స్ కు వాళ్ళు బ్రేక్ ఇచ్చారు. రిలీజ్ చేయాల్సిన లిరికల్ వీడియోను, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను రద్దు చేశారు. సో.. ఒకటి రెండు రోజుల్లో సరికొత్త రిలీజ్ డేట్ ను నిర్మాతలు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీకెండ్ లో ‘ఆచార్య’, ‘కేఆర్ కే’ సినిమాలే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
Sri Vishnu: ‘భళా తందనాన’ విడుదల వాయిదా!

Sri