Site icon NTV Telugu

Bhairavi: చనిపోయిన భైరవి ఎలా తిరిగి వచ్చింది?

Gemini Serial Bhairavi

Gemini Serial Bhairavi

Bhairavi to Telecast in Gemini TV: ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో అద్భుతమైన సీరియల్స్‌ని అందించిన జెమిని TV ఇప్పుడు సరికొత్తగా భైరవి అనే మెగా సోషియో ఫాంటసీ సీరియల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి అనే మెగా సోషియో ఫాంటసీ సీరియల్‌ని మార్చి 18 నుంచి ప్రసారం చేయబోతుంది జెమిని TV. ఇక సీరియల్ కథ విషయానికి వస్తే ఒక సంపన్న కుటుంబం. ఆ ఇంటి ఇల వేల్పు భైరవీదేవి, అందుకే ఆ ఇంట పుట్టిన ఏకైక ఆడపిల్లకు ఆ దేవి పేరే పెట్టుకుంది.. తల్లి శివగామి. కానీ ఆస్తి కోసం, ఆధిపత్యం కోసం ఆరేళ్ళ భైరవిని అంతం చేసేశాడు స్వయాన ఆమె చిన్నాన్న ఆది. ఆ తర్వాత శివగామిని పిచ్చిదాన్ని చేసి ప్రపంచాన్ని నమ్మించాడు, ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకున్నాడు.

RK Sagar: మొగలి రేకులు ఆర్కే నాయుడుకు ఈసారైనా హిట్ అందేనా.. ?

ఒక్కో వ్యాపారంలో తన వాళ్ళని ఒక్కొక్కళ్ళనీ పాతుకుపోయేలా చేశారు. కానీ అతను ఊహించని విధంగా చనిపోయిన భైరవి తిరిగి వచ్చింది. చనిపోయిన భైరవి ఎలా తిరిగి వచ్చింది? అది ఆ ఇంటి ఇలవేల్పు భైరవిదేవి మహత్యమా? లేక మరేదైనా మాయా? తిరిగి వచ్చిన భైరవిని ఆవహించి ఉన్నది అమ్మవారా, ఆత్మా? తనను తుదముట్టించి, తన తల్లిని పిచ్చివాళ్ళను చేసిన వాళ్ళపై భైరవి ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది, తన తల్లి జీవితాన్ని వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా సరిదిద్దింది? అంటూ సాగే సరికొత్త థ్రిల్లింగ్‌ కథతో.. మెగో సోషియో ఫాంటసీ సీరియల్‌.. భైరవి.. ఈ నెల 18న ప్రారంభం అయి రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది. ఇక భైరవి సీరియల్‌లో ఆకాంక్ష గాంధీ, బేబీ రచన, భరద్వాజ్‌ కావ్యరెడ్డి, వణపొన్నప్ప, బసవరాజ్‌, రోహిత్‌, డాలీ, శిల్పా గౌడ, రోహిత్‌ నాయర్‌, తదితర నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.

Exit mobile version