Site icon NTV Telugu

Bhairavam : ఆ ఒక్కటీ క్లియర్ అయితే.. భైరవం బాక్సాఫీస్ ను ఊపేస్తుందా..?

Bhairavam

Bhairavam

Bhairavam : మొన్నటి దాకా పెద్దగా అంచనాలు లేని భైరవం సినిమా.. ఒక్కసారిగా బజ్ క్రియేట్ చేసేసింది. మనోజ్, రోహిత్, సాయి శ్రీనివాస్.. ఈ ముగ్గురూ హిట్ చూసి చాలా కాలం అయింది. పైగా వాళ్ల సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తోంది. అయినా సరే ఈ ముగ్గురి గత సినిమాలకు రానంత హైప్ ఈ ఒక్క మూవీతో వచ్చేసిందంటే దానికి కారణం ట్రైలర్. ఆదివారం రిలీజ్ అయిన ట్రైలర్ అమాంతం అంచనాలను పెంచేసింది. పైగా మూవీ టీమ్ చేస్తున్న ప్రమోషన్లు, మనోజ్ ఇస్తున్న స్టేట్ మెంట్లు మూవీపై బజ్ పెంచేస్తున్నాయి. మూవీకి ఒకే ఒక్క అడ్డంకి ఉంది. అదే ఎగ్జిబిటర్ల థియేటర్ల బంద్. ఒకవేళ మూవీ రిలీజ్ అయ్యే నాటికి వాళ్ల చర్చలు సఫలం అయితే భైరవం సినిమాకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.

Read Also : Minister Narayana: భూ ఆక్రమణలు మానుకోవాలి.. ఆ భూములు స్వాధీనం చేసుకుంటాం..!

పైగా పాజిటివ్ వేవ్ ఎక్కువగా ఉంది. ఆల్రెడీ తమిళంలో హిట్ అయిన గరుడన్ సినిమాకు రీమేక్. విజయ్ కనకమేడల దర్శకత్వంపై అందరికీ ఓ నమ్మకం ఉంది. ట్రైలర్ చూస్తుంటేనే యాక్షన్, ఎమోషన్ కలగలిపి సినిమా తీసినట్టు అర్థం అవుతోంది. అందులోనూ ఈ ముగ్గురు హీరోల లుక్ ఊర మాస్ గా ఉంది. గతంలో ఇంత మాస్ లుక్ లో వీరెన్నడూ కనిపించలేదు. పైగా ఈ మూవీకి పోటీగా తెలుగులో పెద్ద సినిమాలు లేవు. వీరమల్లు రావడానికి 12 రోజుల టైమ్ ఉంటుంది. కాబట్టి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా.. ఆ లోగా బ్రేక్ ఈవెన్ ఈజీగా అయిపోతుంది.

కలెక్షన్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. థగ్ లైఫ్‌ మూవీ ఉన్నా.. ఆ మూవీ దీనికి పెద్ద పోటీ కాకపోవచ్చు. భైరవం సినిమాకు ఉన్న ఫ్యాన్ బేస్ కు హిట్ టాక్ వస్తే కలెక్షన్ల పరంగా ఢోకా ఉండదు. ఈ మూవీలో ముగ్గురు హీరోలు ఉండటం కూడా కలిసొస్తుంది. పైగా ముగ్గురిలో ఎవరూ ఎక్కువ, తక్కువ కాకుండా ఉండటం ఇంకో విషయం. మరి భైరవం ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read Also : Sofiya Qureshi: మంత్రి కున్వర్‌ విజయ్‌షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Exit mobile version