Bhairavam : ఆ ఒక్కటీ క్లియర్ అయితే.. భైరవం బాక్సాఫీస్ ను ఊపేస్తుందా..?
- లుక్ తో హీరోల వైబ్
- ట్రైలర్ తో అంచనాలు
- ఆ సమస్య క్లియర్ అవుద్దా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhairavam : మొన్నటి దాకా పెద్దగా అంచనాలు లేని భైరవం సినిమా.. ఒక్కసారిగా బజ్ క్రియేట్ చేసేసింది. మనోజ్, రోహిత్, సాయి శ్రీనివాస్.. ఈ ముగ్గురూ హిట్ చూసి చాలా కాలం అయింది. పైగా వాళ్ల సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తోంది. అయినా సరే ఈ ముగ్గురి గత సినిమాలకు రానంత హైప్ ఈ ఒక్క మూవీతో వచ్చేసిందంటే దానికి కారణం ట్రైలర్. ఆదివారం రిలీజ్ అయిన ట్రైలర్ అమాంతం అంచనాలను పెంచేసింది. పైగా మూవీ టీమ్ చేస్తున్న ప్రమోషన్లు, మనోజ్ ఇస్తున్న స్టేట్ మెంట్లు మూవీపై బజ్ పెంచేస్తున్నాయి. మూవీకి ఒకే ఒక్క అడ్డంకి ఉంది. అదే ఎగ్జిబిటర్ల థియేటర్ల బంద్. ఒకవేళ మూవీ రిలీజ్ అయ్యే నాటికి వాళ్ల చర్చలు సఫలం అయితే భైరవం సినిమాకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.
Read Also : Minister Narayana: భూ ఆక్రమణలు మానుకోవాలి.. ఆ భూములు స్వాధీనం చేసుకుంటాం..!
Also Read
పైగా పాజిటివ్ వేవ్ ఎక్కువగా ఉంది. ఆల్రెడీ తమిళంలో హిట్ అయిన గరుడన్ సినిమాకు రీమేక్. విజయ్ కనకమేడల దర్శకత్వంపై అందరికీ ఓ నమ్మకం ఉంది. ట్రైలర్ చూస్తుంటేనే యాక్షన్, ఎమోషన్ కలగలిపి సినిమా తీసినట్టు అర్థం అవుతోంది. అందులోనూ ఈ ముగ్గురు హీరోల లుక్ ఊర మాస్ గా ఉంది. గతంలో ఇంత మాస్ లుక్ లో వీరెన్నడూ కనిపించలేదు. పైగా ఈ మూవీకి పోటీగా తెలుగులో పెద్ద సినిమాలు లేవు. వీరమల్లు రావడానికి 12 రోజుల టైమ్ ఉంటుంది. కాబట్టి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా.. ఆ లోగా బ్రేక్ ఈవెన్ ఈజీగా అయిపోతుంది.
కలెక్షన్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. థగ్ లైఫ్ మూవీ ఉన్నా.. ఆ మూవీ దీనికి పెద్ద పోటీ కాకపోవచ్చు. భైరవం సినిమాకు ఉన్న ఫ్యాన్ బేస్ కు హిట్ టాక్ వస్తే కలెక్షన్ల పరంగా ఢోకా ఉండదు. ఈ మూవీలో ముగ్గురు హీరోలు ఉండటం కూడా కలిసొస్తుంది. పైగా ముగ్గురిలో ఎవరూ ఎక్కువ, తక్కువ కాకుండా ఉండటం ఇంకో విషయం. మరి భైరవం ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Read Also : Sofiya Qureshi: మంత్రి కున్వర్ విజయ్‌షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!