NTV Telugu Site icon

Bhairava Dweepam: బాలయ్య – రోజా రొమాన్స్.. మళ్లీ ఇన్నేళ్ల తరువాత.. ?

Roja

Roja

Bhairava Dweepam: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.. స్టార్ హీరోలు ఒకప్పుడు నటించిన హిట్ సినిమాలను.. అభిమానుల కోసం ఇప్పుడు మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. హీరోల పుట్టినరోజులు, స్పెషల్ అకేషన్స్ కు ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు సైతం కొత్త సినిమాలకు ఎంత హడావిడి చేస్తున్నారో రీరిలీజ్ సినిమాలకు అంతకుమించి హడావిడి చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ హిట్ సినిమా రీరిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పుడంటే టెక్నాలజీ, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వచ్చాయి కాబట్టి పురాణాలు, పీరియాడిక్ సినిమాల్లో ఎఫెక్ట్స్ ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి. కానీ ఇవేమి లేనప్పుడు కూడా గ్రాఫిక్స్ తో అదరగొట్టిన సినిమా భైరవద్వీపం. నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రీరిలీజ్ కు సిద్ధమైంది.

Biggboss 7: బిగ్ బాస్ సీజన్ 7.. ఈసారి రెండు హౌస్ లు.. ?

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి. వెంకటరామిరెడ్డి నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన రోజా హీరోయిన్ గా నటించగా రంభ ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 1994లో రిలీజ్ అయిన భైరవ ద్వీపం అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికీ ఈ చిత్రంలోని మ్యూజిక్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. ఇక ముఖ్యంగా బాలకృష్ణ, రోజా కాంబో. ఇప్పుడు పొలిటికల్ గా గొడవ పడుతున్న వీరి మధ్య మంచి స్నేహం ఉండేదని అందరికీ తెలిసిందే. భైరవద్వీపంలో వీరి రొమాన్స్ అప్పట్లో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక నరుడా ఓ నరుడా అంటూ రంభ డ్యాన్స్ ను ఇప్పటికీ మర్చిపోవడం కష్టమే. ఇన్ని హైలైట్స్ ఉన్న ఈ సినిమాను ఆగస్టు 30న రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా భైరవద్వీపం 4k ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇన్నేళ్ల తరువాత బాలకృష్ణ, రోజా రొమాన్స్ మరోసారి చూడాలని ఉంటే ఆగస్టు 30 న థియేటర్ కు వెళ్లిపోవడమే.

Show comments