NTV Telugu Site icon

Bhagyashri Borse: మాస్ మహారాజా పక్కన యానిమల్ భామ కాదు.. ఈమే హీరోయిన్!

Bhagyashri

Bhagyashri

Bhagyashri Borse Comes On Board For Ravi Teja, Harish Shankar Movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. టి జి విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యానిమల్ భామ తృప్తి డింరీ హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అసలు హీరోయిన్ ఎవరో అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే క్లాస్ మహారాణిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత, ఇక ఈ సినిమాలోనే భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటుస్తోంది.

Adivi Sesh: నాకు డబ్బు పిచ్చి లేదు.. అందుకే చాలా పెద్ద ఆఫర్ రిజెక్ట్ చేశా: అడివి శేష్

ఈ సినిమాతోనే భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. మేకర్స్ రిలీజ్ చేసిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్‌లో భాగ్యశ్రీ చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. ఇక ఆ పోస్టర్ లో చీరలో చాలా క్లాసీగా, అందంగా కనిపిస్తోంది ఆమె. నిజానికి హరీష్ శంకర్ హీరోయిన్స్ ని అద్భుతంగా చూపిస్తారని పేరుంది, మరి ఈ భామను ఎలా చూపించనున్నారు అనేది తెలియాల్సి ఉంది. రవితేజ, భాగ్యశ్రీల క్లాస్, మాస్ కాంబినేషన్ ప్రేక్షకులని అలరించబోతోందని హరీష్ శంకర్ వెల్లడించారు. రవితేజ, హరీష్ శంకర్ ముచ్చటగా మూడోసారి కలసి చేస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ట్రేడ్ లోనూ చాలా క్రేజ్ ఉందని అంటున్నారు. ఈ సినిమాలో వీరితో పాటు కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు అలాగే ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారని తెలుస్తోంది.

Show comments