Zee Telugu: ఈ ఆదివారం భగవంత్ కేసరి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా సూపర్ జోడి ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagwanth Kesari world television premiere this Sunday: తెలుగు ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్స్తోఅలరించే జీ తెలుగు ఈ ఆదివారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమై థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలీకాస్ట్ చేయనుంది. అంతేకాదు అదే రోజు తెలుగు ప్రేక్షకులను బుల్లితెర, వెండితెరపై అలరిస్తున్న తారలు తమ జోడీతో కలిసి జంటగా తమలోని ప్రతిభను నిరూపించుకునేందుకు సూపర్ జోడీ వేదికను అందిస్తోంది. నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ భగవంత్ కేసరి ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు టెలీకాస్ట్ కానుండగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా సూపర్ జోడి ప్రారంభం కానుంది. ఆ ప్రోగ్రాం ఇక మీదట, ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో టెలీకాస్ట్ కానుంది. ఇక చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రముఖ యాంకర్ ఉదయభాను జీ తెలుగు సూపర్ జోడి షోతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ షోకి న్యాయనిర్ణేతలుగా ఎవర్గ్రీన్ నటి మీనా, ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ వ్యవహరించనున్నారు..రఘు మాస్టర్ కొరియోగ్రఫీ అనుభవం, శ్రీదేవి విజయ్ కుమార్ అందం ఈ షోని మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Neru Movie Review: ‘నెరు రివ్యూ’.. లాగిపెట్టి కొట్టాలనిపించేలా ప్రియమణి యాక్టింగ్
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
ఇక, ఈ షోలో 8 మంది సెలబ్రిటీ జోడీలు తమ అద్భుతమైన ప్రదర్శనలతో హోరాహోరీగా టైటిల్ కోసం పోటీపడనున్నారు. అయితే ఆ సెలబ్రిటీ జోడీలు ఎవరనేది తెలియాలంటే.. ఉత్కంఠభరితమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నా సూపర్ జోడి ఎపిక్ ప్రీమియర్ ఎపిసోడ్లు మీరు తప్పక చూడాల్సిందే. ఇక అదే రోజున భగవంత్ కేసరి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగు అందిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కథ జైలు నుంచి విడుదలైన మాజీ పోలీస్ అధికారి నేలకొండ భగవంత్ కేసరి(బాలకృష్ణ) పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీ లీల ప్రధాన పాత్రల్లో నటించగా అర్జున్ రాంపాల్, పి. రవిశంకర్, ఆర్. శరత్ కుమార్, రఘుబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ భగవంత్ కేసరి సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా మీ జీ తెలుగులో ఈ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రసారం కానుంది. ఈ సందర్భంగా జీ తెలుగు ‘బనావో బేటీకో షేర్’ కాంటెస్ట్ని నిర్వహించనుంది. ఆడపిల్లల్ని పులిలా పెంచుతున్న తల్లిదండ్రులకు హ్యాట్సాఫ్ చెబుతూ నిర్వహిస్తున్న ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలంటే భగవంత్ కేసరి సినిమా చూస్తూ మీ కూతురితో సెల్ఫీ తీసి టీవీలో కనిపించే ఫోన్ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి, లేదా స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి సెల్ఫీ పంపించాలి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు సర్ప్రైజ్ గిఫ్ట్‌ని పొందుతారు.
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!