NTV Telugu Site icon

Anil Ravipudi: భగవంత్ కేసరి హిట్.. కాస్ట్లీ గిఫ్ట్ పట్టేసిన డైరెక్టర్

Anil

Anil

Anil Ravipudi: సినిమా హిట్ అయితే.. డైరెక్టర్ లకు కార్లు గిఫ్ట్ ఇవ్వడం ఫ్యాషన్ గా మారిపోయింది. ఈ ఆనవాయితీ.. తమిళ్ లో ఎక్కువ ఉంది. ఇప్పుడు అది కొద్దికొద్దిగా తెలుగు కూడా వచ్చేసింది. ఇప్పటికే బేబీ నిర్మాత SKN.. డైరెక్టర్ సాయి రాజేష్ కు కారు గిఫ్ట్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా కాస్ట్లీ కారును గిఫ్ట్ గా పట్టేశాడు. నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించింది. దసరా కానుకగా అక్టోబర్ 19 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొని.. రికార్డ్ కలక్షన్స్ అందుకుంది. అమ్మాయిలను.. షేర్ లా పెంచాలని అనిల్ చెప్పిన విధానం అభిమానులను ఫిదా చేసింది. ఇక కేవలం థియేటర్ లోనే కాకుండా ఓటిటీలో కూడా భగవంత్ కేసరి దూసుపోతుంది.

Gangs Of Godavari: డేట్ మార్చిన విశ్వక్.. ఈసారి ఎప్పుడంటే.. ?

ఇక ఈ నేపథ్యంలోనే నిర్మాతలు మంచి కలక్షన్స్ అందుకోవడంతో.. సంతోషపడి .. డైరెక్టర్ అనిల్ రావిపూడికి కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. బ్లాక్ కలర్ టయోటా వెల్ఫైర్ కారును మేకర్స్.. అనిల్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక దీని రేటు వచ్చి దాదాపు 1.55 కోట్లు ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మేకర్స్ అధికారికంగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం అనిల్ రావిపూడి.. కొత్త కథలతో రెడీ గా ఉన్నాడు. మరి ఈసారి ఏ హీరోతో అనిల్.. సెట్ లో దిగుతాడో చూడాలి.

Show comments