NTV Telugu Site icon

Bhagavanth Kesari: భగవంత్ బాదుడు… హాప్ సెంచరీ కొట్టేశాడు!

Bhagavanth Kesari

Bhagavanth Kesari

‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి జోష్‌లో వచ్చాడు బాలయ్య. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ‘భగవంత్‌ కేసరి’ సినిమా కూడా బాలయ్య హిట్ ట్రాక్ కొనసాగిస్తూ  బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. బాలయ్యను రెగ్యులర్ రొట్ట కొట్టుడు క్యారెక్టర్ లో కాకుండా… ఏజ్ కి తగ్గ పాత్రలో ఫ్రెష్ గా చూసి పండగ చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు. డే వన్ నుంచి  మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న భగవంత్ కేసరి… మంచి ఓపెనింగ్స్‌ను దక్కించుకుంది. ఫస్టే డే 33 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన భగవంత్‌ రెండో రోజు కూడా దుమ్ముదులిపేసింది. రెండో రోజు బాలయ్యకు పోటీగా మాస్ మహారాజా ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీ థియేటర్లోకి వచ్చింది. మరోవైపు దళపతి విజయ్​ ‘లియో’ నుంచి గట్టి పోటీ ఉంది.

ఈ రెండు సినిమాలు సోసోగానే ఆడియన్స్ ని మెప్పించాయి. దీంతో బాలయ్యకి అడ్డు లేకుండా పోయింది. ఈ దసరా విన్నర్ యునానిమస్ గా బాలయ్య అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చెయ్యడంలో బాలయ్య ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ కారణంగానే భారీ వసూళ్లను అందుకున్నాడు నేలకొండ భగవంత్ కేసరి. మొత్తంగా వరల్డ్​వైడ్​గా రెండు రోజుల్లో 51 కోట్లకు పైగా గ్రాస్​ అందుకున్నట్లు తెలిపారు మేకర్స్. దీంతో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్‌కు రెడీ అవుతున్న బాలయ్య… రెండు రోజుల్లోనే హాప్ సెంచరీ కొట్టేసి సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. ఇక యూఎస్‌లో 7 లక్షల 50 వేల డాలర్స్ మార్క్‌ని టచ్ చేసి 1 మిలియన్ డాలర్స్ మార్క్ దిశగా దూసుకెళ్తుంది. దీంతో మొదటి మండేకి భగవంత్ కేసరి సినిమా బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచే ఛాన్స్ ఉంది.

Show comments