NTV Telugu Site icon

Bhagavanth Kesari: భగవంత్ కేసరి సెన్సార్ రివ్యూ.. నెవర్ బిఫోర్ అంతే

Bhagavanth Kesari Censor

Bhagavanth Kesari Censor

Bhagavanth Kesari Censor Report: భగవత్ కేసరి సెన్సార్ రిపోర్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అనిల్ రావిపూడి – బాలకృష్ణ తమ కెరీర్‌లో మొదటిసారి కలిసి భగవంత్ కేసరి అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి భగవంత్ కేసరి పాత్రను చాలా బాగా ఎలివేట్ చేసారని, మొత్తం సినిమాను తన రొటీన్ సినిమాగా కాకుండా విభిన్నమైన టేకింగ్‌తో తెరకెక్కించారని అంతర్గత నివేదికలు బలంగా సూచిస్తుండగా తన జోన్ లో నుంచి బయటకు వచ్చి ఈ సినిమా చేశానని అనిల్ రావిపూడి కూడా బలంగా చెబుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత దసరా పండుగ సెలవుల సందర్భంగా అక్టోబర్ 19న విడుదలకు సిద్ధమవుతున్న భగవత్ కేసరి భారీ ఎత్తున థియేటర్లలో విడుదలవుతోంది. ప్రస్తుతం సినిమా యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

Harish Shankar: రవితేజ ‘షాక్’..నేను కోలుకోవడానికి మూడేళ్లు పట్టింది!

నటీనటులు, టెక్నీషియన్లు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. U/A తో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రన్ టైం 163 నిమిషాలుగా చెబుతున్నారు. ఒక్క కట్ కూడా లేకుండానే U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. సెన్సార్ రిపోర్ట్ చాలా పాజిటివ్ గా ఉంది, ఇండస్ట్రీ బజ్ కూడా సినిమాపై చాలా పాజిటివ్ గా ఉంది. అనిల్ రావిపూడి తన స్టైల్‌ని పూర్తిగా మార్చుకుని ఈసారి కథపై కాన్సంట్రేట్ చేసి భగవంత్ కేసరి క్యారెక్టరైజేషన్‌ని చాలా బాగా డిజైన్ చేసారని సెన్సార్ రిపోర్ట్ చెబుతోంది. ఒక పక్క బ్యాక్ టు బ్యాక్ హిట్‌లతో సూపర్ ఫామ్‌లో ఉన్న బాలకృష్ణ హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్తో భగవంత్ కేసరి ఫామ్ కొనసాగించాలనుకుంటున్నాడు. ఎమోషన్స్ -ఎంటర్‌టైన్‌మెంట్ ను బ్యాలెన్స్ చేస్తూ బాలకృష్ణ అద్భుతంగా నటించినట్టు ట్రైలర్ తో క్లారిటీ రావడంతో ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులలో ఒకరు తనకు పది లైన్ల రివ్యూ ఇచ్చారని ఇలాంటీ సినిమా చేసినందుకు గర్వంగా ఉందని అనిల్ రావిపూడి చెబుతున్నారు.

Show comments