NTV Telugu Site icon

Bhagavanth Kesari: అన్న హరికృష్ణ సినిమానే బాలయ్య రీమేక్ చేస్తున్నాడా?

Bhagavanth Kesari

Bhagavanth Kesari

నందమూరి నట సింహం బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘భగవంత్ కేసరి’. షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసారు. అనిల్ రావిపూడి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య చూపించిన విధానానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. మంచి ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ ని ఇస్తే బాలయ్య ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య సినిమా అనగానే డ్యూటీ ఎక్కడానికి థమన్ రెడీగా ఉంటాడు. సో పాజిటివ్ టాక్ వస్తే చాలు అక్టోబర్ 19న బాలయ్య బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడం గ్యారెంటీ. అయితే భగవంత్ కేసరి సినిమా గురించి ఒక కొత్త టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. నందమూరి హరికృష్ణ నటించిన ‘స్వామీ’ సినిమా 2004లో రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాలో “కవల చెల్లెల్ల”ని మానభంగం చేసి చంపిన వాళ్లపై పాగా తీర్చుకునే అన్నగా హరికృష్ణ నటించాడు. రత్న కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ హరికృష్ణ పెర్ఫార్మెన్స్ కి మంచి పేరొచ్చింది. ఈ సినిమాకే కాస్త మార్పులు చేర్పులు చేసి అనీల్ రావిపూడి మళ్లీ తెరకెక్కిస్తున్నాడని టాక్. బాలయ్యని భగవంత్ కేసరిగా చూపిస్తూ, స్వామి సినిమాలోని మీనా క్యారెక్టర్ లో కాజల్ అగర్వాల్, చెల్లి పాత్రలో శ్రీలీలాని పెట్టి సినిమా చేస్తున్నారని అనుకున్నారు. ఈ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో షైన్ స్క్రీన్ నుంచి క్లారిటీ వచ్చింది. స్వామీ సినిమాని రీమేక్ చెయ్యట్లేదని క్లారిటీ ఇచ్చిన మేకర్స్, అక్టోబర్ 19న అసలు నిజం ఏంటో తెలుస్తుంది. బాలయ్యని ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేస్తారు అంటూ ట్వీట్ చేసారు. మరి అనిల్ రావిపూడి బాలయ్యతో ఎలాంటి సినిమా చేస్తున్నాడు? ఏ రేంజ్ హిట్ కొట్టబోతున్నాడు అనేది చూడాలి.

Show comments