Site icon NTV Telugu

Best Wife – Best Husband: ఉత్తమ భార్యగా శ్రీవాణి.. ఉత్తమ భర్తగా దివ్వెల మహేష్!

Untitled 1 Copy

Untitled 1 Copy

Best Wife – Best Husband: గత కొద్దిరోజులుగా మీడియాలో పెండింగ్ టాపిక్స్ ఏమిటి అంటే లావణ్య- రాజ్ తరుణ్ ఇష్యూ తరువాత నాగచైతన్య – శోభిత ఎంగేజ్మెంట్ . ఇప్పుడు దువ్వాడ శీను మాధురి అడల్టరీ అనే వ్యవహారాలు. మధ్యలో వేణు స్వామి- నాగచైతన్య శోభిత విడిపోతారు అంటూ చెప్పిన జాతకం మీద మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అయితే ఒక అడుగు ముందుకేసి మహిళా కమిషన్కు ఫిర్యాదు కూడా చేసింది.

Also Read: Kishan Reddy: మన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేయడం మనందరి బాధ్యత!

అయితే ఈ ఫిర్యాదు చేసిన తర్వాత వేణు స్వామి భార్య తాను కూడా జర్నలిస్టునే అని చెప్పుకుంటూ మీడియాని తూర్పారబట్టే ప్రయత్నం చేసింది. తన భర్త జాతకం చెబితే చెప్పాడు గాక దాన్ని అంత ప్రాధాన్యత ఇచ్చి మీడియా కవర్ చేయాల్సిన అవసరం లేదని చెబుతూ సుదీర్ఘంగా మీడియాని టార్గెట్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేసింది. అంతేకాక తన భర్త తప్పు ఏమీ లేదు అని చెప్పుకుంటూనే మీడియాతో పాటు ప్రజలు కూడా పద్ధతి మార్చుకోవాలి అని అర్థం వచ్చేలా కామెంట్లు చేసింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో ఉత్తమ భార్య అంటూ చర్చ జరగుతోంది.

ఆ సంగతి అలా ఉంచితే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో కీలకంగా వినిపిస్తున్న పేరు దివ్వెల మాధురి. దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం అనంతరం దివ్వెల మాధురి భర్త.. మహేష్ చంద్రబోస్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తన భార్య మాధురిపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న మహేష్ తనకు రాజకీయాలంటే ఇష్టం లేదన్న ఆయన.. తన భార్యకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లు చెప్పారు. అందుకే రాజకీయాల్లోకి వెళ్తానంటే సపోర్ట్ చేసినట్లు చెప్పారు. నేను మెరైన్ ఇంజినీర్ ను, నాకు పది లక్షలు జీతం. జీతం మొత్తం మా ఆవిడకే పంపిస్తా, మాకు ఆర్థికంగా కూడా సమస్యలు లేవు.

Also Read: JR.NTR: జస్ట్ వన్ క్లిక్ తో.. గ్లోబల్ స్టార్ ‘తారక్’ టాప్ 3 అప్ డేట్స్..

మాధురి చక్కని డ్యాన్సర్, చివరకు మాధురి డ్యాన్స్ మీద కూడా ఆరోపణలు చేశారు. మాధురి నన్ను ఒక బాబు లాగా చూసుకుంది. మాధురి నాకు అమ్మలాంటిది, మా అమ్మ తర్వాత అమ్మలాంటిది. కుక్కలు మొరుగుతుంటాయి కానీ నేను పట్టించుకోను.. ఎవరేమన్నా నా మాధురి నా మాధురే” అని మహేష్ చంద్రబోస్ అభిప్రాయపడ్డారు. దీంతో వేణు స్వామి భార్య శ్రీవాణి ఉత్తమ భార్య అయితే ఈ దివ్వెల మాధురి భర్త మహేష్ ఉత్తమ భర్త అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Exit mobile version