Site icon NTV Telugu

NTR : ఎన్టీఆర్-కొరటాల.. అదిరిపోయే ట్యూన్..!

Ntr

Ntr

ఆ యంగ్ టాలెంట్ ఏం చేసినా.. ఎలాంటి ట్యూన్ ఇచ్చినా.. సెన్సేషనల్‌గా నిలుస్తుంది. పైగా ఆచార్యతో డీలా పడిపోయిన కొరటాల.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌తో సాలిడ్ హిట్ కొట్టేందుకు కసిగా ఉన్నాడు. అందుకే ఈ సారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌-కొరటాల శివ.. మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్‌ చేశారు. ఇప్పటికే ఎన్నో మాస్ బీట్స్‌తో రచ్చ లేపిన అనిరుధ్.. ఈ సారి ఎన్టీఆర్ కోసం అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడట. మరి ఆ మాస్ బీట్ ఎలా ఉండబోతోంది..?

 

‘మిర్చి’ సినిమాతో మెగా ఫోన్ పట్టాడు కొరటాల శివ. ఆ తర్వాత ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘భరత్ అనే నేను’ చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకొని.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే రీసెంట్‌గా వచ్చిన ఆచార్యతో భారీ ఫ్లాప్ అందుకున్నాడు. కారణాలు ఏమైనా.. ఒకే ఒక్క ప్లాప్‌తో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నాడు కొరటాల. దాంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌తో ఫ్లాఫ్ మచ్చను తుడిచుకునేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. రీసెంట్‌గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. తనదైన మార్క్‌తో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ బిగ్ అప్టేట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా కోసం కొత్త టీమ్‌తో ముందుకెళ్తున్నాడు కొరటాల. వారిలో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ కూడా ఉన్నాడు. ఇంతకు ముందు కొరటాల సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా పని చేశారు. అయితే ‘ఆచార్య’ చిత్రానికి మాత్రం సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మను తీసుకున్నారు. ఇదే ఆచార్యకు పెద్ద మైనస్‌ అయిందని చెప్పొచ్చు. అందుకే ఈ సారి అనిరుధ్‌ని రంగంలోకి దింపాడు. దాంతో ఎన్టీఆర్ కోసం అదిరిపోయే ట్యూన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట అనిరుధ్. అభిమానులు కూడా అతను అద్బుతమైన మాస్ బీట్స్ ను ఇస్తాడనే నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే.. తమిళ్‌లో అనిరుధ్‌కు భారీ క్రేజ్ ఉంది. అక్కడ అతని పాటలు ఓ రేంజ్‌లో సెన్సేషనల్‌గా నిలిచాయి. రీసెంట్‌గా వచ్చిన బీస్ట్ మూవీలోని అరబిక్ కుత్తు సాంగ్‌ దుమ్ము దులిపేసింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కోసం కూడా.. ఓ అదిరిపోయే మాస్ బీట్ రెడీ చేస్తున్నాడట అనిరుధ్. దాంతో నందమూరి అభిమానులకు థియేటర్లో పూనకాలే అని చెప్పొచ్చు.

Exit mobile version