NTV Telugu Site icon

యూట్యూబ్ యాంకర్ కు “ఎక్స్ ట్రా జబర్దస్త్” ఆఫర్

Best of Extra Jabardasth Offer to Anchor Sravanthi

యూట్యూబ్ యాంకర్ శ్రవంతికి మల్లెమాలలో అద్భుతమైన అవకాశం వచ్చింది. “బెస్ట్ ఆఫ్ ఎక్స్ ట్రా జబర్దస్త్” కోసం ఎంపికైనట్టు ఈ తెలుగమ్మాయి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కొంతకాలం నుంచి “శ్రీదేవి డ్రామా కంపెనీ” అనే షోలో ఇమ్మానుయేల్ కు జంటగా చేరి కామెడీ పండిస్తున్న శ్రవంతికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ అందరినీ తనవైపుకు అట్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రవంతి తనకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో, ఆ ఆఫర్ ఆమెను ఎలా వరించిందో ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

Read Also : తొలిసారి లేడీ ఓరియెంటెడ్ మూవీలో కత్రీనా కైఫ్!

ఆమె పోస్ట్ ప్రకారం “కనీసం నేను బెడ్ మీద నుండి లేవలేని సిట్యుయేషన్. నడవటానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఆ సిట్యుయేషన్ లో మల్లెమాల ఆఫీస్ నుండి కాల్ వచ్చింది,బెస్ట్ అఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్ కోసం ఆడిషన్ ఉంది రావాలి అని,వాళ్లకి యాంకర్ ని తీసుకోవడం చాలా అర్జెంటు,నా ముందు రెండే ఎంపికలు ఆ రోజు ”టేక్ ది రిస్క్ ఆర్ లూస్ ది ఛాన్స్”… ఇంట్లో వాళ్ళు అందరూ ఈ పరిస్థితిలో ఎందుకులే వద్దు అన్నారు. అప్పటికే ఆ నెలలో వచ్చిన అన్ని ఆఫర్స్ ని వదిలేసుకున్నాను. ఏదైతే అది అయ్యింది అని దేవుడి మీద భారం వేసి నా కష్టాన్ని నమ్మి వెళ్లాను ఆడిషన్ కి!!
అక్కడికి వెళ్ళాక చూస్తే నాతో పాటూ ఓ ఆరుగురు గురు అమ్మాయిలు కూడా వచ్చారు. అందరు చాలా బాగా రెడీ అయ్యారు. ఫుల్ ఎనర్జిటిక్ గా డాన్స్ వేశారు. ఇంక నేను అనవసరంగా వచ్చాను. నేను కనీసం స్ట్రాంగ్గా నిలబడలేని పరిస్థితి అని నా మనసులో అనుకొని వెళ్లి నిలుచున్నాను. ఓ సాంగ్ ప్లే చేశారు ఏదో రెండు స్టెప్స్ వేసా మెల్లగా. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కూడా సక్సెస్ ఫుల్ గా చెప్పేశాను.

అసలా రెండు గంటలు ఎలా గడిచాయో కూడా తెలీదు. నాతో వచ్చిన లేడీ అసిస్టెంట్ ఫుల్లు ఏడవడం మొదలు పెట్టింది. మీకు ఏమైనా జరగరానిది జరిగితే ఎలా అమ్మ అంది. ఏం కాదులే అమ్మాయి అంతా మంచే జరుగుతుంది లే అన్నాను. మొత్తానికి అయ్యాక ఇంటికి వచ్చేసాం. ఇంక నాకు రాదు లే అని ఫిక్స్ అయిపోయి ఆ రెండు రోజులూ ఆలోచిస్తూ ఉండిపోయాను. సడన్ గా మళ్లీ మల్లెమాల నుండి మేనేజర్ కాల్ చేశారు. ఒకసారి ఆఫీస్ కి రండి సార్ మీతో మాట్లాడతారట అని. ఫైనల్ గా మీటింగ్ కి వెళ్లాను మాట్లాడాను చాలా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు. మీకు ఈ షో చేయటం ఇష్టమేనా అని అడిగారు. ప్రోగ్రాం మీ దృష్టిలో చిన్నది అవ్వచ్చు. కానీ నాకు ఈ పరిస్థితిలో అదో పెద్ద అచీవ్మెంట్. మొత్తానికి నేను “టేక్ ది రిస్క్ వన్స్ ఇన్ ఏ లైఫ్, నెవర్ గివప్” అన్నది నమ్మాను… ఆ లాస్ట్ ఫోటోలో ఉన్న పరిస్థితి ఆ రోజు నాది” అంటూ తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

View this post on Instagram

A post shared by Sravanthi Prashanth (@sravanthi_chokarapu)