Bengaluru Court Allowed The 4 Accused To Be Shifted To Tumakuru Jail: కర్ణాటక రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన 17 మంది నిందితుల్లో నలుగురిని తుమకూరు జైలుకు తరలించేందుకు బెంగళూరు సెషన్స్ కోర్టు అనుమతించింది. ఈ నలుగురు నిందితులు రేణుకా స్వామి కేసులో నటుడు దర్శన్ పేరును బయట పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అతను ఉన్న అదే జైలులో ఆ నలుగురిని ఉంచవద్దని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును ఆశ్రయించారు. జూన్ 8న రేణుకా స్వామి హత్యకు గురయ్యారు. ఆ తర్వాత తామే హత్య చేశామని దర్శన్ గ్యాంగ్ ఒప్పుకునేలా నలుగురిని ఏర్పాటు చేసింది.
Amrapali: రేవంత్ సర్కార్‌లో కీలక అధికారిగా ఆమ్రపాలి.. ఒకేసారి 5 పోస్టులు!
నటుడు దర్శన్ నుంచి 30 లక్షలు డబ్బు అందుకున్న తర్వాతే హత్య చేశామని నలుగురు నిందితులు లొంగిపోయారు. అయితే పోలీసులు తమదైన శైలిలో జరిపిన కఠిన విచారణలో నటుడు దర్శన్ సహా పలువురి పేర్లు పోలీసులకు వెల్లడైనట్లు సమాచారం. దర్శన్ సహా పలువురి పేర్లు పోలీసులకు లీక్ చేసి, అన్నింటినీ అంగీకరించడంతో ఆ నలుగురిని సాక్షులుగా పరిగణిస్తున్నారు. సాక్షులు, నిందితులు ఒకే జైలులో ఉంటే మనసు మారడం లేదా కోపంతో దాడి చేసుకునే అవకాశం ఉంది. అలాగే రేణుకాస్వామి హత్య కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 17 మంది ఒకే చోట ఉండటం సురక్షితం కాదు. శాంతిభద్రతల దృష్ట్యా నిందితుల జైలును మార్చడమే సముచితమని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురిని మరో జైలుకు తరలించాలని కోరినట్లు సమాచారం.