కోల్‌కతా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో చోరీ చేస్తూ ఓ టీవీ నటి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన సంచలనంగా మారింది. బెంగాలీకి చెందిన నటి రూపా దత్తా.. పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ వస్తుంది. అయితే తాజాగా కోల్‌కతా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో లో చోరీ చేస్తూ పట్టు బడింది.. ఆ ఈవెంట్ లో చెత్త బుట్టలో ఖాళీ వ్యాలెట్ ని పడేస్తూ కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను చెక్ చేయగా .. ఆమె బ్యాగ్ లో ఎన్నో వ్యాలెట్ లు కనిపించాయి. అందులో రూ. 70 వేలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు తో పాటి ఒక డైరీని కూడా స్వాధీనం చేసుకున్నామని .. అందులో సంచలన నిజాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
రూపా దత్తాకు చోరీ చేయడం కొత్తేమి కాదని, అంతకుముందు చాలా సార్లు చోరీలు చేసిందని, వాటికి సంబధించిన వివరాలన్నీ డైరీలో రాసుకుందని తెలిపారు. ఈ విషయాన్ని రూపా కూడా అంగీకరించింది. కోల్‌కతాలోని రద్దీ ప్రదేశాలలో పిక్ ప్యాకెట్స్ చేసేదాన్ని అని, డబ్బు కోసం ఇలా చేయాల్సివచ్చిందని తెలిపింది. దీంతో ఆమెపై పలు కేసులు నమోదు చేసి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇకపోతే రూపా దత్తా.. దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసి ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
