NTV Telugu Site icon

Bellamkonda Srinivas: ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడి పెరిగింది.. ఆఫర్లొచ్చినా వదులుకున్నా

Bellamkonda Srinivas

Bellamkonda Srinivas

Bellamkonda Srinivas Talks About His Bad Days: తెలుగులో ఏడు సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఇప్పుడు ఛత్రపతి హిందీ రీమేక్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. మే 12వ తేదీన ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతంగా చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నాడు. తన కెరీర్‌లో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు. మొదటి సినిమా చేశాక తనకు బోలెడన్ని ఆఫర్లు వచ్చాయని.. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని కుండబద్దలు కొట్టాడు.

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న పీపుల్స్ స్టార్

బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘నా తండ్రి నిర్మాత కావడం వల్లే నేను సినిమాల్లోకి చాలా ఈజీగా వచ్చానని అందరూ అంటుంటారు. అది నిజమే, నా తండ్రి వల్లే సులభంగా పరిశ్రమలోకి వచ్చాను. కానీ.. ఆ తర్వాత నేను హార్డ్ వర్క్ చేయడం వల్లే, ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోగలిగాను. నా తొలి సినిమా అల్లుడు శీను మంచి విజయం సాధించింది. ఆ సినిమాను నిర్మించిన మా నాన్న, నాకెంతో సపోర్ట్ చేశారు. అయితే.. అందులో సమంత, తమన్నా నటించేందుకు అంత ఈజీగా ఒప్పుకోలేదు. నేను వారికి 5 నిమిషాల డ్యాన్స్‌, 5 నిమిషాల యాక్టింగ్‌, 5 నిమిషాల యాక్షన్‌ వీడియోల క్లిప్‌లను తీసి, ఒక డెమో వీడియో క్రియేట్ చేసి, వారికి పంపించాను. ఆ వీడియో క్లిప్స్ చైసిన తర్వాతే వాళ్లు అల్లుడు శీనులో నటించేందుకు ఓకే చెప్పారు’’ అని చెప్పుకొచ్చాడు.

ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీలు(మార్కెట్ క్యాపిటల్ ప్రకారం)

ఆ సినిమా మంచి సక్సెస్ సాధించిందని, అయితే ఆ సమయంలోనే తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని శ్రీనివాస్ తెలిపాడు. తన తండ్రి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన 8 సినిమాలు బోల్తాకొట్టడంతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని అన్నాడు. దాంతో తనపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని.. ఆ ఒత్తిడి వల్లే తొలి సినిమా తర్వాత వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. ఏడాదిన్నర పాటు తాను ఇంట్లోనే కూర్చుండిపోయానన్నాడు. ఆ తర్వాత తాను తక్కువ బడ్జెట్‌లో రెండో సినిమా చేశానని, అనంతరం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేసిన జయ జానకి నాయక చిత్రంతో తాను అన్ని విధాలుగా నిలదొక్కుకున్నానని శ్రీనివాస్ వివరించాడు.