అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా, ఎలాంటి గొడవలకి, కాంట్రవర్సీలకీ పోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు మార్కెట్ ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హిందీలో మాత్రం స్టార్ హీరో రేంజ్ మార్కెట్ ఉంది. సాయి శ్రీనివాస్ డబ్బింగ్ సినిమాలకి మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. అతను ఏ సినిమా రిలీజ్ చేసిన అది హిందీలో డబ్ అవ్వాల్సిందే, లక్షల్లో వ్యూస్ తీసుకోని రావాల్సిందే. మాములు మాస్ సినిమాలని రిలీజ్ చేస్తేనే యుట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ అవుతుంటే ఇక బోయపాటి శ్రీను లాంటి ఊర మాస్ డైరెక్టర్ తో చేసిన జయ జానకి నాయక మూవీ యుట్యూబ్ లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
2017లో తెలుగులో రిలీజ్ అయిన జయ జానకి నాయక సినిమా బాగానే ఆడింది, ఇదే మూవీని హిందీలో డబ్ చేసి పెన్ మూవీస్ యుట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ చేశారు. 2019 ఫిబ్రవరి 8న హిందీలో జయ జానకి నాయక ‘ఖూన్కార్’ అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటివరకూ రికార్డ్ స్థాయిలో 700 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఏ బాషలో అయినా ఒక సినిమా 700 మిలియన్ వ్యూస్ రాబట్టడం ఇదే మొదటిసారి. యుట్యూబ్ లో రిపీట్ వ్యూస్ రాబడుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి మాత్రం ఏకంగా హిందీ బాక్సాఫీస్ నే టార్గెట్ చేశాడు. తనకి తెలుగు డెబ్యు ఇచ్చిన వీవీ వినాయక్ దర్శకత్వంలో, ప్రభాస్-రాజమౌళిల కాంబినేషన్ లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాని సాయి శ్రీనివాస్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. మే 12న ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ముందుకి రానుంది. మరి హిందీ ఛత్రపతి సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఎలాంటి లాంచ్ ఇస్తుందో చూడాలి.
Jaya Janaki Nayaka becomes the first ever movie in the world to cross 700 million views on Youtube. pic.twitter.com/ossc6Jlnxz
— Abhishek (@vicharabhio) March 27, 2023
https://www.youtube.com/watch?v=1lFk1LSsI_c
