Site icon NTV Telugu

మూడో సినిమా మొదలెట్టేసిన బెల్లంకొండ గణేశ్

Bellamkonda Ganesh Third Movie launched with a Pooja Ceremony

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు గణేశ్‌ అన్న సాయి శ్రీనివాస్ అడుగుజాడల్లో నడుస్తూ హీరో అయ్యాడు. రెండేళ్ళ క్రితం పవన్ సాదినేని దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్‌ డెబ్యూ మూవీ మొదలైంది. ఆ తర్వాత రెండో సినిమాకూ శ్రీకారం చుట్టేశాడు. ఈ రెండు తుది మెరుగులు దిద్దుకుంటున్న సమయంలోనే ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాను పట్టాలెక్కించేశాడు బెల్లంకొండ గణేశ్‌.

Read Also : తెలుగులో రాబోతున్న కార్తీ ‘మద్రాస్’

‘నాంది’ వంటి థాట్ ప్రొవోకింగ్ మూవీని నిర్మించిన సతీశ్ వర్మ… బెల్లంకొండ గణేశ్ హీరోగా తేజ శిష్యుడు రాకేశ్ ఉప్పలపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మూవీ నిర్మిస్తున్నారు. ఎస్. వి. -2 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లోని ఈ రెండో సినిమా పూజా కార్యక్రమాలు నిరాడంబరంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ కొట్టగా, ‘అల్లరి’ నరేశ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య మాటలు, పాటలు రాశారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా అనిత్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నాడు. ఇదో న్యూ ఏజ్ థ్రిల్లర్ మూవీ అని దర్శక నిర్మాతలు తెలిపారు.

Exit mobile version