Site icon NTV Telugu

Christmas Clash : డిసెంబరు 25 రేస్ లో బెల్లం vs మేక..

Tollywood

Tollywood

తండ్రి శ్రీకాంత్ నటనను వారసత్వంగా తీసుకున్న రోషన్ మేక. టాలీవుడ్ హృతిక్ రోషన్‌లా పేరైతే వచ్చింది కానీ సినిమాలు కంప్లీట్ చేయడంలో జోరు చూపించడం లేదు. రోషన్ పెళ్లి సందడితో స్టార్ అయ్యాడు కానీ ఎక్కడైతే స్టార్టైయ్యాడే అక్కడే ఆగిపోయాడు. నాలుగేళ్లుగా అతడి నుండి ఫిల్మ్ రాలేదు. ప్రజెంట్ ఛాంపియన్ అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు రోషన్.

ఈ ఇయర్ రోషన్ బర్త్ డే సందర్భంగా ఛాంపియన్ మూవీ ఎనౌన్స్ మెంట్ చేసింది స్పప్న సినిమాస్. మాలీవుడ్ బ్యూటీ అనశ్వర రాజన్ హీరోయిన్‌గా టాలీవుడ్‍కు పరిచయం కాబోతుంది. రీసెంట్లీ ఈ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 25న సినిమా తీసుకు వస్తున్నట్లు వెల్లడించింది. క్రిస్మస్ బరిలో సినిమాను దింపడం ఇప్పుడు హాట్ టాపికయ్యింది. అదే రోజు అడవి శేష్.. డెకాయిట్ రిలీజ్ చేయబోతున్నట్లు ఎప్పుడో ఎనౌన్స్ చేశాడు. కానీ అడివి శేష్ కు గాయం అవడం షూటింగ్ డిలే అవడంతో రిలీజ్ వాయిడా వేశారు. కానీ ఛాంపియన్ తో ఢీ కొట్టేందుకు వస్తున్నాడు బెల్లంకొండ. కిష్కింధపురి సూపర్ హిట్ తో మంచి జోరు మీదున్నాడు బెల్లంకొండ. ప్రస్తుతం భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో ‘టైసన్ నాయుడు’ అనే సినిమా చేస్తున్నాడు. మరో రెండు షెడ్యూల్స్ షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ చేయబోతున్నారు. డెకాయిట్ పోస్ట్ పోన్ తో సోలో రిలీజ్ దొరికిందనుకున్న ఛాంపియన్ కు టైసన్ నాయుడుతో పోటీ ఎదురవుతోంది. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారో.

Exit mobile version