Site icon NTV Telugu

Beast: మొన్న అరబిక్ కుత్తు.. ఇప్పుడు జాలీ ఓ జింఖానా అంటున్న కోలీవుడ్ స్టార్

beast

beast

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బీస్ట్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఇటీవలే ఈ చిత్రం నుంచి రిలీజైన అరబిక్ కుత్తు సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు.

ఇక తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జాలీ ఓ జింఖానా అంటూ సాగే ఈ సాంగ్ ని హీరో విజయ్ పాడడం విశేషం.. గోవా బీచ్ ఒడ్డున మ్యూజిక్ బ్యాండ్ తో రాక్ స్టార్ లా విజయ్ మైక్ పట్టుకొని పాడుతుండగా.. హీరోయిన్ పూజా, డైరెక్టర్ నెల్సన్, అనిరుధ్ డాన్స్ చేస్తూ కనిపించారు. ఇక ఈ ఫుల్ సాంగ్ ని మార్చి 19 న విడుదల చేయనున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. నారి మొన్న అరబిక్ కుత్తులా ఈ జాలీ ఓ జింఖానా కూడా రికార్డులు సృష్టిస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14 న రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలి.

Exit mobile version