Beast Movie Title Changed in Hindi : కోలీవుడ్ స్టార్ విజయ్ తాజా చిత్రం “బీస్ట్” ఏప్రిల్ 13న థియేటర్లలోకి రానుంది. నెల్సన్ దిల్ప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. గత ఏడాది ‘బీస్ట్’ను ప్రకటించినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ నుండి ఇప్పటికే రెండు పాటలను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. “అరబిక్ కుతు” ఇంటర్నెట్ ను షేక్ చేయగా, “జాలీ జింఖానా” సాంగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు విజయ్ అభిమానులు. అయితే ఇప్పటిదాకా తమిళంలోనే విడుదలవుతుందని అనుకున్నారు అంతా. కానీ ఈరోజు తాజా అప్డేట్ తో విజయ్ పాన్ ఇండియా రేసులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వెల్లడించారు మేకర్స్.
Read Also : RRR : జక్కన్న మ్యాజిక్ కు ‘బాహుబలి’ రికార్డ్స్ బ్రేక్
“బీస్ట్” తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు రెడీ అవుతోంది. ఈ మేరకు తాజాగా అన్ని భాషల్లో రిలీజ్ డేట్ కు సంబంధించి విడుదల చేసిన పోస్టర్లలో ‘బీస్ట్’ అనే టైటిల్ ఉంది. కానీ ఒక్క హిందీలో మాత్రం టైటిల్ ను చేంజ్ చేశారు మేకర్స్. హిందీలో ఈ చిత్రం ‘రా’ అనే పేరుతో విడుదల కాబోతోంది. హిందీ మార్కెట్ ను, అక్కడి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ‘బీస్ట్’ను ‘రా’గా మార్చినట్టు తెలుస్తోంది. మరి మొదటిసారిగా పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అయిన విజయ్ ఈ సినిమాతో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటాడో చూడాలి.
