‘బ్యాట్ మేన్’ కు కొత్త కళ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండితెరపై బ్యాట్ మేన్ కథలు కళకళలాడం కొత్తేమీ కాదు. 1943లో లూయిస్ విల్సన్ బ్యాట్ మేన్ గా నటించిన సీరియల్ తొలిసారి జనానికి వినోదం పంచింది. తరువాత బ్యాట్ మేన్ గా రాబర్ట్ లోవరీ నటించిన బ్యాట్ మేన్ అండ్ రాబిన్ కూడా 15 ఎపిసోడ్స్ సీరియల్ గానే అలరించింది. ఆ తరువాత 1966లో బ్యాట్ మేన్ సినిమాగా జనం ముందు నిలచింది. ఇందులో ఆడమ్ వెస్ట్ బ్యాట్ మేన్ పాత్రలో మురిపించారు. అదే సంవత్సరం మళ్ళీ బ్యాట్ మేన్ సీరియల్ ప్రేక్షకులను పరవశింప చేసింది. ఇలా బ్యాట్ మేన్ కామిక్స్ ఆబాలగోపాలాన్నీ అలరిస్తూ వచ్చాయి. ఆ తరువాత 1989లో మళ్ళీ బ్యాట్ మేన్ వెండితెరపై వెలిగింది. అప్పటి నుంచీ వరుసగా బ్యాట్ మేన్ రిటర్న్స్, బ్యాట్ మేన్ ఫరెవర్, బ్యాట్ మేన్ అండ్ రాబిన్ వంటి చిత్రాలు 1990లలో వెలుగు చూశాయి. తరువాత బ్యాట్ మేన్: ఇయర్ ఒన్ అండ్ బ్యాట్ మేన్ బియాండ్ అనే సినిమా, ఆ పై బ్యాట్ మేన్ వర్సెస్ సూపర్ మేన్ వంటి చిత్రాలలోనూ బ్యాట్ మేన్ కథ సాగింది.
మళ్ళీ 2005లో బ్యాట్ మేన్ బిగిన్స్ వచ్చింది. ఆ తరువాత దాని సీక్వెల్స్ గా ద డార్క్ నైట్, ద డార్క్ నైట్ రైజెస్వంటి బ్యాట్ మేన్ ఆధారిత కథలూ అలరించాయి. బ్యాట్ మేన్ కథల్లోని పాత్రల ద్వారా కూడా జోకర్ వంటి కొన్ని సినిమాలు రూపొందడం విశేషం. ఆపై బ్యాట్ గర్ల్ కూడా సందడి చేసింది. ఇంతలా బ్యాట్ మేన్ కథలు ఎన్ని వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆదరణ లభిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే బ్యాట్ మేన్ కు మళ్ళీ ఓ కొత్త కళ తెచ్చేందుకు అన్నట్టు తాజాగా మరో బ్యాట్ మేన్ రూపొందింది. ఈ సారి బ్యాట్ మేన్ గా రాబర్ట్ ప్యాటిన్సన్ నటించాడు. ట్విలైట్, టెనెట్ వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించిన రాబర్ట్ ప్యాటిన్సన్ కు యువతలో విశేషమైన క్రేజ్ నెలకొంది. నిజానికి బెన్ అఫ్లెక్ ను తాజా బ్యాట్ మేన్ లో నటించమని కోరారు నిర్మాతలు. అయితే, అతను అంగీకరించక పోవడంతో రాబర్ట్ ప్యాటిన్సన్ ను అదృష్టం వరించింది.
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
రాబర్ట్ నటించిన బ్యాట్ మేన్ మార్చి 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్ కు రాబర్ట్ హాజరవుతున్నాడు. ఎక్కడ చూసినా, అప్పుడే బ్యాట్ మేన్ సీక్వెల్ ఎలా ఉంటుందనే ప్రశ్నలు వినిపించడం విశేషం. జనం సినిమా చూడక ముందే సీక్వెల్ గురించి అడుగుతున్నారంటే, ప్రేక్షకుల్లో బ్యాట్ మేన్ పాత్రకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో వచ్చిన బ్యాట్ మేన్ సీరిస్ కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుందని, నవతరం ప్రేక్షకులు కోరుకొనే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉండబోతున్నాయని రాబర్ట్ చెబుతున్నాడు. జనాల్లో ఎంతో క్రేజ్ ఉన్న బ్యాట్ మేన్ పాత్రలో తాను నటించడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని అంటున్న రాబర్ట్ ఈ సినిమా ఎండింగ్ అనూహ్యంగా ఉంటుందని, దాని నుంచే సీక్వెల్ కు లైన్ సాగుతుందని అంటున్నాడు. ఇప్పటికే ఎంతోమంది మేటి నటులు ప్రాణం పోసిన బ్యాట్ మేన్ పాత్రకు రాబర్ట్ ప్యాటిన్సన్ ఏ తీరున జీవం పోశాడో చూడాలని జనం ఆసక్తిగా ఉన్నారు. మార్చి 4న కొత్త బ్యాట్ మేన్గా రాబర్ట్ జేజేలు అందుకుంటాడో లేదో తేలిపోతుంది.
తాజావార్తలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!