NTV Telugu Site icon

Bollywood: బాలీవుడ్ లో బతుకమ్మ.. అది మన రేంజమ్మ

Poojaa

Poojaa

Bollywood: బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి పునాది. ఆడపడుచుల సందడి.. మగువుల ఆచారం.. సంప్రదాయం.. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ. పూలను కొలిచే అరుదైన పండుగ. తెలంగాణలో బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ బతుకమ్మ ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్ళింది. అదేంటి.. అర్ధం కాలేదు అనుకుంటున్నారా..? అవును.. తెలంగాణ బతుకమ్మ పండుగ.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో మెరిసింది. బతుకమ్మ పాన్ ఇండియా స్థాయిలో కనిపించనుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల్లో అంటూ .. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా పాడే రోజులు వచ్చాయి. తాజాగా సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం కిసీ కా భాయ్.. కిసీ కా జాన్. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

Pawan Kalyan: ఉస్తాద్ డైరెక్టర్ కు పవన్ స్పెషల్ విషెస్

తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజాకు అన్నగా వెంకీ మామ నటిస్తుండం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి బతుకమ్మ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ బతుకమ్మ పండుగ చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంది. పూజా హెగ్డే, భూమిక, బతుకమ్మలను తయారు చేస్తూ.. బతుకమ్మ పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ముఖ్యంగా వెంకీ మామ సాంగ్ మొత్తానికి హైలైట్ గా నిలిచాడు. ఇక మధ్యలో సల్మాన్ భాయ్.. అచ్చ తెలుగు ఇంటి అల్లుడులా అడుగుపెట్టడం అద్భుతంగా ఉంది. మునుపెన్నడూ లేని విధంగా సల్మాన్ పంచెకట్టుతో కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. అది మన తెలంగాణ రేంజ్ అంటే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.