Site icon NTV Telugu

SSMB28: ఆగిపోయిన మహేశ్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్.. అసలు నిజం ఇది!

Mahesh Trivikram Film

Mahesh Trivikram Film

Baseless Rumours On Mahesh Babu Trivikram Project SSMB28: మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలోని SSMB28 సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే! ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ ప్రారంభించగా.. మూడు రోజుల్లోనే తొలి షెడ్యూల్ పూర్తి చేసేశారు. ఆ తర్వాత బ్రేక్ ప్రకటించారు. ప్రస్తుతం మహేశ్ లండన్‌లో తన ఫ్యామిలీతో హాయిగా సమయం గడుపుతున్నాడు. అయితే.. ఈ గ్యాప్‌లో ఒక షాకింగ్ రూమర్ పుట్టుకొచ్చింది. స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయాల్సిందిగా త్రివిక్రమ్‌కి మహేశ్ సూచించాడని, అందుకోసం కొన్నాళ్లు షూటింగ్ ఆపేశారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఆ మార్పులు చేయడంలో బిజీగా ఉన్నాడని, మార్పులయ్యాక తిరిగి షూటింగ్ ప్రారంభిస్తారని టాక్ నడిచింది. షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు కాబట్టే, మహేశ్ తన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లాడని అంటున్నారు.

అయితే.. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆ రూమర్స్‌లో ఏమాత్రం వాస్తవం లేదని తేలింది. స్క్రిప్టులో మార్పులు చేయమని మహేశ్ ఎలాంటి సూచనలూ ఇవ్వలేదని, సెట్స్ మీదకి వెళ్లడానికి ముందే త్రివిక్రమ్ వినిపించిన స్క్రిప్టుతోనే మహేశ్ సంతృప్తిగా ఉన్నాడని తెలిసింది. మహేశ్ తల్లి హఠాన్మరణం చెందడం వల్లే షూటింగ్ ఆపేశారు. కథలో మార్పులు చేయడం లాంటివేమీ లేవని, లండన్ నుంచి మహేశ్ తిరిగి రాగానే షూటింగ్ పునఃప్రారంభించనున్నారని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఇందులో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 28వ తేదీన విడుదల కానుంది. అతడు, ఖలేజా తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version