ట్రైలర్ టాక్: చిన బంగార్రాజు చిలిపి చేష్టలకు మురిసిపోతున్న’బంగార్రాజు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సంక్రాంతి అంటే.. ముగ్గులు, సందళ్ళు, పేకాటలు, కొత్త అల్లుళ్ళు అన్నట్లుగా అన్ని ఈ ట్రైలర్ లో దించేశారు మేకర్స్.. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటోంది.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. బంగార్రాజు నరకంలో కూడా అమ్మాయిలతో సరసాలు ఆడుతూ కనిపిస్తాడు. ఇక అచ్చు గుద్దినట్లు తాత బుద్దులతో పుట్టిన చిన బంగార్రాజు కూడా ఊర్లో ఏ అమ్మాయిని వదలకుండా సరసాలు ఆడుతూ కనిపిస్తాడు. ఇంతలో తన చదువు, తెలివితేటలతోనే సర్పంచ్ గా అయ్యాయని చెప్పుకుతిరిగే నాగలక్ష్మి ప్రేమలో పడిపోతాడు చిన బంగార్రాజు. ఇక మనవడికి వచ్చిన సమస్యను తీర్చడానికి బంగార్రాజు భూలోకం వచ్చినట్లు చూపించారు. ఈసారి రమ్యకృష్ణ కూడా ఆత్మగా కనిపించింది. మనవడికి వచ్చిన సమస్య ఏంటి.. ఆ సమస్యకు ఆ వురి దేవాలయానికి ఉన్న సంబంధం ఏంటి.. ఆ లయకారుడు ఆజ్ఞ ఎలా ఉంది..?చివరికి చిన బంగార్రాజు లైఫ్ ని బంగార్రాజు సెట్ చేశాడా..? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. చిన బంగార్రాజు గా నాగ చైతన్య లుక్ అదిరిపోయింది. దసరా బుల్లోడు లాగా పూల పూల చొక్కాలు.. మెడలో పులిగోరు చైన్ తో ఆకట్టుకున్నాడు. ఇక నాగార్జున ఎప్పటిలానే తెల్ల పంచెకట్టులోనే కనిపించాడు. నాగలక్ష్మిగా కృతి శెట్టి ఆకట్టుకొంది. ట్రైలర్ కి అనూప్ సంగీతం హైలైట్ గా నిలిచింది. వెరసి బంగార్రాజు ట్రైలర్.. సోషల్ ఫాంటసీ అంశాలతో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు కనిపిస్తోంది. మరి ఈ సివినిమ సంక్రాంతి హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.
Also Read
- The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
తాజావార్తలు
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!