Site icon NTV Telugu

Bandla Ganesh: పెద్దలకు నమస్కారం మన సంస్కారం రా లఫూట్..

New Project (7)

New Project (7)

నటుడు, నిర్మాత బండ్ల గణేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమాని అనడం కన్నా భక్తుడు అని చెప్పాలి. పవన్ ను దేవుడిలా కొలుస్తూ ఉంటాడు. పవన్ కు ఎప్పుడు అండగా ఉండడానికి సిద్ధం గా ఉంటాడు. ఇక ఎవరైనా పవన్ ను విమర్శిస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. వారికి తనదైన స్టైల్లో బుద్ధి చెప్పేవరకు నిద్రపోడు. అందుకే పవన్ అభిమానులకు బండ్లన్న అంటే మక్కువ ఎక్కువ.. ఇక నిత్యం సోషల్ మీడియాలో తన దేవర పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉండే బండ్లన్న తాజాగా మరో పోస్ట్ పెట్టగా అది కాస్తా వైరల్ గా మారింది. అందులో పవన్ సీనియర్ రాజకీయ నేతల కాళ్లకు దండం పెడుతూ ఉన్న ఫోటోలను యాడ్ చేసి ఉన్న ఒక ఫోటోను పవన్ విమర్శకులు ట్రోల్ చేస్తున్నారు. దానికి సమాధానంగా బండ్ల గణేష్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

“పెద్దలకు నమస్కారం మన సంస్కారం రా లఫూట్ అని చెప్పాపెద్దలకు నమస్కారం మన సంస్కారం రా లఫూట్ అని చెప్పా .. మై బాస్ పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీనిపై పవన్ అభిమానులు సూపర్ చెప్పావ్ బండ్లన్న అని కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరు మాత్రం ఇంకా విమరిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక బండ్ల గణేష్ కెరీర్ విషయానికొస్తే ఇటీవలే ‘డేగల బాబ్జీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.. ప్రసుతం బండ్ల గణేష్ పలు సినిమాల్లో కమెడియన్ గా నటిస్తున్నాడు.

Exit mobile version