Site icon NTV Telugu

Bandla Ganesh: సిగ్గు లేదా.. మీకు జీవితంలో బుద్ధి రాదు.. మీ బతుకులు చెడ

Bandla

Bandla

Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బండ్ల మళ్లీ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో బండ్ల కామెంట్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తనకు నచ్చనిది ఏదైనా దాని మీద నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. అవతలివాడు ఎంతటి వాడు అయినా బండ్ల లెక్కచేయడు. తాజాగా బండ్ల గణేష్.. తానా సభ్యుల తీరుపై మండిపడ్డాడు. అమెరికాలో సుదీర్ఘ చరిత్ర ఉన్న తానా సభలకు ఈసారి ఫిలడెల్ఫియా వేదికగా నిలిచింది. పెన్సిల్వేనియాలో జరుగుతున్న 23వ తానా మహసభలను ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పలువురు ప్రముఖులుఈ వేడుకలను ప్రారంభించారు.

Niharika Konidela: అమ్మాయిల్లో నేను ఆ టైప్ అంటున్న మెగా డాటర్

ఇక ఈ నేపథ్యంలోనే తానా సభల్లో అపశృతి చోటుచేసుకుంది. తానా కమిటీ సభ్యులు అయిన తరణి పరుచూరి, సతీష్ వేమన వర్గాలు కొందరు చొక్కాలు పట్టుకొని మరీ కొట్టుకున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ గొడవకు కారణం ఆధిపత్య పోరు అని తెలుస్తోంది. మేము గొప్ప.. మేము గొప్ప అంటూ మొదలైన చిన్న మాట.. చొక్కాలు పట్టుకొని కొట్టుకొనేవరకు వెళ్ళింది. ఇక ఈ గొడవకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. తానా సభలో జరిగిన గొడవపై బండ్ల గణేష్ ఫైర్ అయ్యాడు. ఆ గొడవ వీడియోలను షేర్ చేస్తూ.. “తానా పరువు తీస్తున్నారు కదా.. దాని నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పట్టా కష్టాన్ని గంగలో కలిపారు నీచుల్లారా.. సిగ్గు లేదా.. మీకు జీవితంలో బుద్ధి రాదు.. మీ బతుకులు చెడ” అంటూ తిట్టిపోశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక బండ్లన్న ట్వీట్ పై అభిమానులు మద్దతు పలుకుతున్నారు.

Exit mobile version