Bandla Ganesh Strucked in Hyderabad Traffic: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక రకమైన ట్వీట్లు పెడుతూ కామెంట్లు చేస్తూ హడావుడి చేసే బండ్ల గణేష్ ఎరక్కపోయి ఇరుక్కున్నారు. అసలు విషయం ఏమిటంటే హైదరాబాదులో ఆయన ప్రయాణిస్తున్న కారు దాదాపు ఐకియా జంక్షన్ వద్ద రెండు గంటలసేపు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినట్లుగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. కాబట్టి ఏదైనా పని ఉంటే తప్ప హైదరాబాద్ లో రోడ్డు ఎక్కవద్దని ఆయన సూచించారు. ఇక ప్రస్తుతానికి హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. ఇక భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ పొంగిపొర్లుతున్నాయి.
Big Breaking: హిరణ్యకశిపను ప్రకటించిన రానా.. గుణశేఖర్ ప్లేస్ లో గురూజీ..?
ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మూమెంట్స్ బాగా మందగించాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అనేక ప్రాంతాల్లో అవుతోంది. అదిగాక ఐటీ ఉద్యోగుల ఆఫీసులు పూర్తయి వారంతా ఇళ్లకు బయలుదేరే సమయం కావడంతో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలలోని రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ఇక బండ్ల గణేష్ విషయానికి వస్తే గత కొద్ది రోజుల క్రితం వైరల్ ఫీవర్ తో బాధపడుతూ కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందిన ఆయన ఈ మధ్యనే డిశ్చార్జ్ అయ్యారు. గతంలో పవన్ కళ్యాణ్ తో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్న ప్రకటించారు కానీ దర్శకుడు ఎవరు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే ఆ ప్రాజెక్ట్ సెట్ అయినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఆ విషయం గురించి బండ్ల గణేష్ ఎలాంటి ట్వీట్లు గాని సోషల్ మీడియాలో ప్రస్తావించడం కానీ చేయడం లేదు.
Stuck in traffic for 2 hours near ikea ….!!!!! Without work don’t come out 🙏 pic.twitter.com/n0CoiRSqgN
— BANDLA GANESH. (@ganeshbandla) July 19, 2023