NTV Telugu Site icon

Bandla Ganesh: రేవంత్ రెడ్డిని చూస్తుంటే నాకు ఆ ‘సినిమా’ గుర్తొస్తోంది!

Revanth Reddy

Revanth Reddy

Bandla Ganesh Intresting Tweet about Telangana CM Revanth Reddy: నటుడు, నిర్మాతగా మారిన బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఆయన ఎంతగానో ఇష్టపడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఉంటుందని అందరూ భావించారు కానీ 2018 ముందస్తు ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి షాద్నగర్ టికెట్ ఆశించిన బండ్ల గణేష్ టికెట్ రాకపోయినా పార్టీ కోసం గట్టిగానే ప్రచారం చేశారు. 2023 ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తరపున చాలా గట్టిగా వాయిస్ వినిపిస్తూ వచ్చిన బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించక ముందు నుంచి రేవంత్ రెడ్డి సీఎం కాండిడేట్ అంటూ తన సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు.

Samuthirakani: పొలిటికల్ లీడర్ బయోపిక్‌లో సముద్రఖని?

ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హాస్పిటల్ లో పరామర్శించిన ఫోటోను సైతం షేర్ చేసి మీ సంస్కారానికి పాదాభివందనం ముఖ్యమంత్రి గారు అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఒక ఆసక్తికరమైన ఫోటో షేర్ చేసిన బండ్ల గణేష్ దానికి మరింత ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా పెట్టారు. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన ఒకే ఒక్కడు సినిమా పోస్టర్ తో పాటు రేవంత్ రెడ్డి ఫోటోని కూడా షేర్ చేసి మన ముఖ్యమంత్రి గారిని చూస్తుంటే నాకు ఒకే ఒక్కడు సినిమా గుర్తొస్తోంది అంటూ రాసుకొచ్చాడు బండ్ల గణేష్.

Show comments