NTV Telugu Site icon

Bandla Ganesh: గురు పూర్ణిమ.. దూరంగా ఉంటా అంటూ బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్

Bandla Ganesh Tweet

Bandla Ganesh Tweet

Bandla Ganesh Guru Pournima tweet on Pawan kalyan: ఈ మధ్య కాలంలో సినీ నటుడు ఆ తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తనకు అవగాహన ఉన్న అన్ని విషయాల మీద స్పందిస్తూ ఉండే బండ్ల త్రివిక్రమ్ ను కొన్నాళ్ల నుంచి టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన పేరు మెన్షన్ చేయక పోయినా గురూజీ గురూజీ అని అంటూ పలు ట్వీట్లు చేస్తూ ఆ తర్వాత వాటిని డిలీట్ చేస్తూ ఉండే బండ్ల గురు పూర్ణిమ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మా గురువుకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అని మొదలు పెట్టిన ఆయన ఆ ట్వీట్ పెట్టింది గురూజీ అంటే త్రివిక్రమ్ అనుకునేరు కానీ కాదు, ఆయన పవన్ ను ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేశారు.

Anasuya: నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ..

ఇక ఆ ట్వీట్ లో మీరు మీలాగే ఉండాలి మీరు అనుకున్నవన్ని సాధించాలి, కసితో కృషితో మీరు అనుకున్నవన్నీ సాధిస్తారని రాసుకొచ్చాడు. మీ స్థాయి ఏంటో? మీ స్థానం ఏంటో? తెలిసిన వాడిగా చెబుతున్న, ఎప్పుడు ఏ విధంగా మీ కీర్తిని కానీ మీ పేరును వాడుకొని లబ్ధి పొందను, పొందడానికి కూడా ప్రయత్నించను అని, వీలైతే మీకు సహాయంగా ఉంటాను, లేకపోతే దూరంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నట్టు రాసుకొచ్చారు. అంతేగాని మిమ్మల్ని ఏ విధంగా వాడుకొని నేను ఏ విధమైన లబ్ధి పొందనని, గురు పౌర్ణమి సందర్భంగా గురువు సాక్షిగా చెబుతున్నాను, నా చూపు నా ఆశ ఒకటే మీరు అనుకున్న ఆశయం సాధించాలి, సాధిస్తారని అన్నారు. మీ నిస్వార్ధమైన మీ మనసు లాగే మీరు పది కాలాలపాటు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ బండ్ల గణేష్ అని ఆ సుదీర్ఘ ట్వీట్ లో రాసుకొచ్చారు.

Show comments