Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కూడా అభిమానులుగానే ఉంటారు. అది ఆయన స్థానం మరి. ఇక బండ్ల గణేశ్ ఏ స్థాయి అభిమాని అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవికి తాను వీరాభిమానిని అంటూ ఎప్పుడూ చెప్పుకుంటాడు బండ్ల గణేశ్. అందుకు తగ్గట్టే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. తాజాగా తన ఇంట్లోనే దీపావళి పార్టీని ఏర్పాటు చేసి సినీ పెద్దలను ఆహ్వానించాడు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, సిద్దు జొన్నలగడ్డ, హరీష్ శంకర్, తేజ సజ్జా లాంటి వాళ్లు ఎంతోమంది వచ్చారు.
Read Also : Samantha : భోజనం చేయడానికి డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా.. సమంత ఎమోషనల్
ఈ పార్టీకి చిరంజీవి రాగానే వెళ్లి కాళ్ల మీద పడ్డాడు బండ్ల. చిరును దగ్గరుండి లోపలకు తీసుకెళ్లి ప్రత్యేకంగా చేయించిన కుర్చీలో కూర్చోబెట్టాడు. ఈ కుర్చీ గురించి తాజాగా బండ్ల రియాక్ట్ అయ్యాడు. మా అన్నయ్య నా ఇంటికి వస్తున్నాడని ప్రత్యేకంగా ఆయన కోసం సింహాసనం రెడీ చేయించాను. ఆయన అందులో కూర్చోగానే నా మనసు ఉప్పొంగిపోయింది. ఆయన మా ఇంటికి రావడం నా జీవితంలో మర్చిపోలేను. ఇది నా లైఫ్ లో మెమరబుల్ మూమెంట్ అంటూ తెలిపాడు బండ్ల గణేశ్.
Read Also : Samantha : చిన్నారులతో సమంత దీపావళి వేడుకలు
