Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు సమాజంలో జరిగే సమస్యలపై కూడా బండ్ల సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటాడు. ఇక నిత్యం వివాదాస్పద ఇంటర్వ్యూలు చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారే బండ్ల గణేష్ మరో సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఇచ్చి షాక్ ఇచ్చాడు. బండ్ల గణేష్ లేటెస్ట్ ఇంటర్వ్యూ ప్రోమోను షేర్ చేశాడు. ఈ ఇంటర్వ్యూ లో బండ్లన్న తన మనోగతాన్ని చెప్పుకొచ్చాడు. అసలు తను ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు అన్న దగ్గరనుంచి.. నిర్మాతగా ఎలా మారాడు.. తన జీవితంలో వివాదాలు, కేసులు, అవమానాలు, కష్టాలు అన్ని ఏకరువు పెట్టాడు. ఇక రాజకీయ పరంగాను బండ్లన్న హీట్ రాజేశాడు.
పవన్ కళ్యాణ్ తో విభేదాలు, ఎన్టీఆర్ తో, పూరితో, కృష్ణవంశీ తో అందరితోను ఉన్న విభేదాల గురించి గణేష్ మొదటిసారి నోరువిప్పారు. ఇక రాజకీయంగా విజయసాయి రెడ్డి కి ట్వీట్ చేయడంపై నోరు విప్పాడు.. పెద్దాయన రామోజీరావు ను ఆయన తెలియక ఏవేవో అనేయడంతో మనసుకు కష్టంగా ఉందని ట్వీట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఏపీ లో ఆధిపత్య పోరు నడుస్తోంది.. కులాలను వేరుచేసి కొట్టుకుంటున్నారు.. వాటిపై మీ అభిప్రాయం ఏంటి అని అడుగగా.. ” ఎవరికి తెల్సు సార్ ఆంధ్రా సంగతి.. అదో పెద్ద రోత రాజకీయం.. మనకెందుకు” అని చెప్పుకొచ్చాడు.. మీరు స్పందిస్తున్నారు కాబట్టి అడిగాను యాంకర్ అనడంతో ” స్పందించాను అంటే నేను ఒక్క విజయసాయి రెడ్డి ట్వీట్ మీదనే స్పంస్పందించాను. దాని తరువాత బొత్స నారాయణ ఫోన్ చేసి కేకలు వేశాడు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ప్రోమోలోనే ఈ రేంజ్ లో ఉంటే ఫుల్ ఇంటర్వ్యూలో బండ్లన్న ఏ రేంజ్ లో చెప్పి ఉంటాడో చూడాలి.
