శ్రీగణపతి సచ్చిదానంద బయోపిక్ ప్రకటించిన బండ్ల గణేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధ్యాత్మిక గురువు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీవితంపై బయోపిక్ తీయబోతున్నట్టు నిర్మాత, నటుడు గణేష్ ప్రకటించారు. సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామితో ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు గణేశ్. నటుడిగా పేరు సంపాదించిన తర్వాత బండ్ల గణేష్ నిర్మాణ రంగంలోకి దిగాడు. ‘తీన్ మార్, ఆంజనేయులు, గబ్బర్ సింగ్, బాద్ షా, టెంపర్’ వంటి సినిమాలను నిర్మించాడు. ఆ తర్వాత కొంత కాలం రాజకీయ ప్రయాణం కూడా సాగించాడు. అయితే అది సరిగ్గా సాగకపోవడంతో మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. గతేడాద ‘సరిలేరు నీకెవ్వరు’లో చిన్న పాత్రతో మళ్ళీ నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు.
Read also : తగ్గేదే లే… రికార్డ్స్ బద్దలు కొడుతున్న “రాధేశ్యామ్”
Also Read
త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని అంటున్నాడు. ఇదిలా ఉంటే ఆదివారం సచ్చిదానంద స్వామి బయోపిక్ ప్రకటనను చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ‘అప్పాజీ జీవిత చరిత్ర సినిమా చేసి తీరతా. ఆయన పాదాల సాక్షిగా అనుమతించారు. ఎవరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు’ అంటూ స్వామీజీతో దిగిన ఫోటోను గణేష్ ట్వీట్ చేశాడు. మరి ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? సచ్చిదానంద స్వామి పాత్ర ఎవరు పోషిస్తారన్నది తేలాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను బండ్ల గణేష్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘డేగల బాబ్జీ’ సినిమా షూటింగ్ లో ఉంది.
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!