Bandla Ganesh: సినీ నటులు బండ్ల గణేష్, శివాజీ రాజా అనారోగ్యం పాలైన ఓ డ్రైవర్‌ను ఆదుకున్నారు. అయితే వీరు సాయం చేసిన విధానం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. నిజానికి వీరిద్దరి మధ్య 30 ఏళ్ల స్నేహం ఉంది. అదే ఇప్పుడు ఓ కుటుంబాన్ని నిలబెట్టింది. విషయానికి శివాజీ రాజా ప్రస్తుతం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ నెల 25న ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కు ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ప్రెసిడెంట్ గా బరిలోకి దిగాలని భావించారు. కానీ ప్రెసిడెంట్ గా ఆది శేషగిరి రావు బరిలో ఉండటంతో ఆయన మీద గౌరవంతో తిరిగి వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే శివాజీ రాజా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారని భావించిన బండ్ల గణేష్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
RRR: నిన్న శంకర్.. నేడు కాశీ విశ్వనాథ్!
దీంతో తామిద్దరిలో ఎవరున్నా ప్రజలకు మంచి జరగాలని భావించిన శివాజీ రాజా ఒకరికొకరు ఓ అవగాహనకు వచ్చి ఎవరు ఎక్కువగా మంచి పనికి సహాయపడిడే వారు బరిలో ఉండాలని అనుకున్నారు. అందుకుగాను 5 లక్షల పదహారు వేలు విరాళం ఇస్తానని బండ్ల గణేష్ మాట ఇచ్చారు. ఆ డబ్బును ఆక్సిడెంట్‌కి గురై కళ్ళు పోగొట్టుకొని కిడ్నీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న నరేష్ అనే డ్రైవర్‌కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలంటే ఒకరిపై ఒకరు ఆరోపణలతో మీడియాకు ఎక్కుతున్న ఈ రోజుల్లో మంచి పని చేస్తే పోటీ నుంచి వైదొలుగుతానని శివాజీ రాజా చెప్పడం దానికి బండ్ల గణేష్ సిద్ధం కావడం అభినందనీయం. అలా ఐదు లక్షల పదహారు వేల చెక్కును గణేశ్ నరేష్ కుటుంబానికి అందజేశారు. దాంతో ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో తాను బండ్ల గణేష్ కు మద్దతు ఇస్తున్నానని, బండ్ల గణేష్‌కు ఒక అవకాశం ఇచ్చి చూడాలని శివాజీ రాజా కోరారు.
