NTV Telugu Site icon

Balayya: లుక్ మార్చనున్న భగవంత్ కేసరి… మొదలవనున్న కొత్త సినిమా

Balayya Costliest Song

Balayya Costliest Song

అక్టోబర్ 19న భగవంత్ కేసరి సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్న నందమూరి నట సింహం బాలకృష్ణ… లుక్ మార్చడానికి రెడీ అయ్యాడు. భగవంత్ కేసరి షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ చేసిన బాలయ్య… ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూనే నెక్స్ట్ సినిమా పనులు మొదలుపెట్టాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరుకి కంబ్యాక్ మూవీ ఇచ్చిన బాబీతో బాలయ్య నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం బాలయ్య లుక్ టెస్ట్ చేస్తున్నాడట. బాలయ్యకి హెయిర్ స్టైల్, మీస కట్టు పర్ఫెక్ట్ గా ఉంటే చాలు సినిమా సగం హిట్ అయినట్లే అనే నమ్మకం అందరిలోనూ ఉంది. మరి బాబీ ఈ సినిమాలో బాలయ్యని ఎలా చూపించబోతున్నాడు అనేది చూడాలి. 

ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న NBK 109 మూవీ లుక్ టెస్ట్ అయిపోయిన తర్వాత… బాలయ్య పూర్తిగా కొత్త లుక్ లోకి మారిపోతాడు. సినిమాలో ఏ లుక్ లో ఉంటాడో, అదే లుక్ లో బయట కూడా ఉండడం బాలయ్యకి అలవాటు. సినిమా పూర్తయ్యే వరకూ అదే లుక్ తో బాలయ్య బయటకి వస్తుంటాడు. మరి బాబీ డిజైన్ చేస్తున్న లుక్ ని అఫీషియల్ గా రివీల్ చేయకముందే బాలయ్య ఏమైనా లీక్ చేస్తాడేమో చూడాలి. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో హ్యూజ్ సెట్ ని ఎరక్ట్ చేసారు. ఈ సెట్ లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ తో NBK 109 సినిమా షూటింగ్ కిక్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం.తండ్రి కొడుకులుగా బాలయ్య నటించబోతున్నట్లు సమాచారం.