Site icon NTV Telugu

Nandamuri Balakrishna: మొన్న ఎన్టీఆర్ చేసింది తప్పైతే.. ఇప్పుడు బాలయ్య చేసిందేంటి..?

Ntr

Ntr

Nandamuri Balakrishna: నందమూరి కుటుంబం గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఏ హీరో ఏది మాట్లాడినా సంచలనమే అవుతోంది. ఇక ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కానీ టీడీపీ గురించి కానీ, వైసీపీ గురించి కానీ ఒక్క మాట మాటలాడిన అది హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు తీసుకుంటాడా..? లేదా.. అనేది ఇప్పటికి ఒక మిస్టరీగా కొనసాగుతూనే ఉంది. ఇక ఇదంతా పక్కన పెడితే నందమూరి కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా, వేరేవారు ఆ కుటుంబాన్ని ట్రోల్ చేసినా అందరు ఒక్క మాట మీదనే ఉండి నందమూరి కుటుంబం స్పందిస్తోంది. ఇక అలా నందమూరి కుటుంబం మొత్తం ఇటీవల సీఎం జగన్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై స్పందించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నో చర్చలకు దారి తీశాయి. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్‌ఆర్‌ పేరు పెడితే… ఆయన గౌరవం పెరగదని చురకలు అంటించారు. ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు.. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్‌ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్‌ స్థాయిని తగ్గించదన్నారు ఎన్టీఆర్. యూనివర్సిటీ కి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేదు అని చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ ఇంత నిదానంగా చెప్పడం, ముఖ్యంగా వైఎస్ఆర్ గురించి ఎన్టీఆర్ మాటలు వింటే ఆయనను ప్రశంసిస్తున్నట్లే ఉందని, తారక్ కన్నా అభిమానులే గట్టిగా ప్రశ్నిస్తున్నారు అని విమర్శించారు. ఎన్టీఆర్ కు తగ్గ మనవడు తారక్ కాదని కూడా తిట్టిపోశారు. ఈ విషయంలో తారక్ చేసింది పెద్ద తప్పని కూడా చెప్పుకొచ్చారు.

ఇక తారక్ విషయం పక్కన పెడితే.. నందమూరి బాలకృష్ణ సైతం వైఎస్ఆర్ ను ప్రశంసించడం టీడీపీ నేతలకు కానీ, నందమూరి అభిమానులకు కానీ రుచించడం లేదట. తాజాగా రిలీజైన అన్ స్టాపబుల్ ప్రోమోలో బాలయ్య “వైఎస్ఆర్ గ్రేట్.. లెజెండ్ ను మిస్ అయ్యాం”అని చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య అన్న మాటలను గౌరవం కొద్దీ అన్నారు అని కొందరు అంటున్నారు. అయితే అంతకుముందు ఎన్టీఆర్ ను ట్రోల్ చేసినప్పుడు ఇదే గౌరవం అనుకోవచ్చు కదా.. మరి అప్పుడు ఎందుకు ఎన్టీఆర్ ను ట్రోల్ చేశారు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తారక్ పై విమర్శలు చేసిన వాళ్లు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో చెప్పండి అని అడుగుతున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. రాజకీయాలలో చనిపోయిన వారి గురించి నెగెటివ్ గా మాట్లాడడం పద్దతి కాదు.. అందుకే చంద్రబాబు సైతం ఈ షో లో వైఎస్ఆర్ గురించి నెగెటివ్ గా మాట్లాడింది లేదు. ఇప్పుడు బాలయ్య కూడా అదే పద్దతిని పాటిస్తున్నారు అని మరికొందరు అంటున్నారు. ఇదంతా కరెక్ట్ అయినప్పుడు.. అప్పుడు తారక్ అన్న వ్యాఖ్యలను కూడా ఇలాగే పాజిటివ్ గా తీసుకోవాలి కానీ అప్పుడెందుకు తమ హీరోను నెగెటివ్ చేశారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version