Site icon NTV Telugu

Balayya :మరోసారి ఆ హీరోయిన్ తో నటించబోతున్న బాలయ్య…?

Whatsapp Image 2023 06 20 At 7.29.14 Pm

Whatsapp Image 2023 06 20 At 7.29.14 Pm

బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా వున్నాడు.. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది.ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీలీల ముఖ్య పాత్రలో కనిపించనుంది.ఈ సినిమా దసరాకు విడుదల కాబోతుంది.ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు.. ఇక తాజాగా బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ టీజర్‌ను కూడా విడుదల చేసారు.టీజర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది.. ఈ మూవీలో హిందీ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్‌గా నటిస్తున్నాడని సమాచారం.ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ లో నెలకొండ భగవంత్ కేసరి అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌కు నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు. ఇక ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త సినిమాను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దర్శకుడు బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ నిర్మించనుందని సమాచారం.నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తుంది..దేవిశ్రీ సంగీతం అందించనున్నారు. అయితే ఈసినిమాలో హీరోయిన్‌గా బాలయ్య సరసన నయనతార నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమెను మూవీ టీమ్ సంప్రదించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సింహా, జై సింహా, శ్రీరామ రాజ్యం వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మరీ ఈ సినిమాలో నయనతార కన్ఫర్మ్ అయినట్లు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.బాలయ్య అఖండ సినిమాకు ముందు తీసుకున్న రెమ్యూనరేషన్ 10 కోట్ల వరకు ఉండేది.అయితే దాన్ని ఇప్పుడు బాగా పెంచినట్లు సమాచారం.. బాలయ్య రెమ్యూనిరేషన్ తీసుకునే విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఓ సినిమా ఒప్పుకునే ముందు ఏదో కొంత మొత్తం అనుకుంటారని సమాచారం.. అయితే ఈ సినిమా విడుదల అయిన తరువాత సినిమా టాక్ బాగోలేకపోతే ఆ రెమ్యూనరేషన్‌ను తగ్గించడం కూడా జరుగుతుందని సమాచారం.. ఆ విధంగా బాలయ్య నిర్మాతల మంచి కోరతారు బాలయ్య.

Exit mobile version