NTV Telugu Site icon

Balayya: ఏంటయ్యా నవదీప్ నీ నాన్సెన్స్… డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడమేగా

Balayya

Balayya

నందమూరి నట సింహం బాలయ్య ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతాడు, ఏది అనిపిస్తే అది చెప్పేస్తాడు. ఎలాంటి కల్మషం లేకుండా ఉండడం బాలయ్య నైజం, అందుకే ఆయన అంటే తెలుగు సినీ అభిమానులకి ప్రత్యేకమైన ఇష్టం. గత కొంతకాలంగా సినిమాలతో పాటు స్టేజ్ షోస్ తో కూడా దుమ్ము దులుపుతున్న బాలకృష్ణ, ఇటివలే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఇన్-ఆగ్రాల్ ఎపిసోడ్ కి నెవర్ బిఫోర్ హంగామా చేశాడు. టాప్ 12 కాంటెస్టెంట్ లని ఇంట్రడ్యూస్ చేస్తూ ర్యాప్ సాంగ్స్ పాడిన బాలయ్య, ఫస్ట్ వీక్ టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్ లో జడ్జ్ గా కూడా వ్యవహరించాడు. ఆహా ప్లాట్ ఫామ్ కి ఫ్లాగ్ బేరర్ గా ముందుండి నడిపిస్తున్న బాలయ్య, తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2కి స్టార్టింగ్ నుంచే మంచి వ్యూవర్షిప్ తీసుకోని వస్తున్నాడు. ఈ సంధర్భంగా యాక్టర్ నవదీప్, బిందు మాధవిలు తన కొత్త సీరీస్ ‘న్యూసెన్స్’ ప్రమోషన్స్ కోసం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2కి వచ్చారు.

హోస్ట్ హేమచంద్ర నవదీప్, బిందు మాధవిలని వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఇంట్రడ్యూస్ చెయ్యడంతో మొదలైన ఈ ఎపిసోడ్ ప్రోమో ఫుల్ లెంగ్త్ ఫన్నీగా ఉంది. నవదీప్ గొంతుసరి చేసి పాడుతూ ఉంటే అది వినలేక బాలయ్య “ఏంటయ్యా నవదీప్ నీ నాన్సెన్స్?” అని అడగడంతో నాన్సెన్స్ కాదు సర్ న్యూసెన్స్ అంటూ షో నేమ్ ని యాక్టర్స్ రివీల్ చేశారు. న్యూసెన్స్ పేరు వినగానే బాలయ్య “ఆ నాకు తెలుసులే నవదీప్, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన నవదీప్… కార్ వదిలేసి వెళ్లిపోయిన నవదీప్ అని వీకెండ్స్ ఎక్కడో ఒక చోట వినిపించేది. దాని గురించేనా ఇదంతా” అని సరదాగా అడిగాడు. న్యూస్ నిజంగానే జరిగింది చెప్తున్నారా? లేక కల్పించి చెప్తున్నారా అనేది మా షోలో చూపించబోతున్నామని నవదీప్, బిందు మాధవి న్యూసెన్స్ షోని ప్రమోట్ చేశారు. ఓవరాల్ గా ప్రోమోలోనే మంచి ఫన్ ఉంది మరి ఫుల్ ఎపిసోడ్ లో బాలయ్య, నవదీప్ ని తన కామెడీ టైమింగ్ తో ఎలా ఆడేసుకున్నాడో చూడాలి.

Show comments