NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి

Nbk 112

Nbk 112

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది. ఈ సినిమా కథ అద్భుతంగా వచ్చిందని, బాలయ్యను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపించేలా కొరటాల శివ స్క్రిప్ట్‌ను రూపొందించారనే ప్రచారం సాగుతోంది. కొరటాల సినిమాల్లో ఉండే సామాజిక సందేశం, బలమైన భావోద్వేగాలు, పవర్‌ఫుల్ మాస్ ఎలివేషన్స్ ఈ చిత్రంలో కూడా ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయని సమాచారం. ఈ అంశాలన్నింటినీ బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్.

ఈ చిత్రం కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచే అవకాశాలు ఉన్నాయని టాక్. ఈ సినిమాకు బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. ఏకంగా 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్. ఇప్పుడు కథ కూడా అదిరిపోయిందని అంటున్నారు. ఈ లెక్కన ఎన్బీకె 112 మామూలుగా ఉండదని నందమూరి అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వలో ఎన్బీకె 111 ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా అయిపోయిన వెంటనే కొరటాల ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఎన్బీకె 112 థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, ఈ సినిమాకు కార్పెంటర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.