నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు చిన్న తెరపై కూడా వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞతో దూసుకుపోతున్నాడు. ఇంతకుముందు తన అభిమానులు, ప్రేక్షకులు ఎవ్వరూ చూడని తనలోని మరో యాంగిల్ ను పాపులర్ సెలెబ్రిటీ టాక్ షో “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” ద్వారా చూపిస్తున్నారు. తెలుగు ఓటిటి ‘ఆహా’ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న ఈ షో అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. ఈ షోకు వీక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. హోస్ట్ బాలయ్య చేస్తున్న హంగామా, ఫన్ అందరినీ ఆకట్టుకుంటోంది.
Read Also : “ఆచార్య”తో పోటీకి సై… తగ్గేదే లే అంటున్న స్టార్ హీరో, హీరోయిన్
తాజాగా ఈ షోలో 3వ ఎపిసోడ్ కోసం నటుడు, కామెడీ కింగ్ బ్రహ్మానందం, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఆహ్వానించారు. ఇది ప్రస్తుతం ‘ఆహా’లో ప్రసారం అవుతోంది. సరదాగా సాగిన ఈ ఎపిసోడ్‌లో ఏఎన్నార్ ను బాలయ్య ఇమిటేట్ చేసిన వీడియోను ‘ఆహా’ ప్రత్యేకంగా విడుదల చేయగా, ప్రస్తుతం అది నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. బ్రహ్మీ కోరిక మేరకు బాలకృష్ణ దివంగత లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారిని అనుకరించి యాక్టింగ్ చేస్తూ డైలాగులు చెప్పారు. బాలయ్య చాలా స్పష్టంగా, పర్ఫెక్ట్ టోన్‌తో ఏఎన్నార్ ను డైలాగ్‌ని చెప్పి ప్రేక్షకులను, అతిథులను కూడా ఆశ్చర్యపరిచారు.
బాలయ్య ప్రస్తుతం తన తాజా చిత్రం ‘అఖండ’ బ్లాక్ బస్టర్ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. దేశవిదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు “అఖండ” జాతర జరుపుకుంటున్నారు.
