Site icon NTV Telugu

Balayya: ఆదివారం కూడా బ్రేక్ లేదు… భగవంత్ కేసరి జోష్ లో ఉన్నాడు

Balayya Costliest Song

Balayya Costliest Song

2023 సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నట సింహం నందమూరి బాలకృష్ణ, ఈ దసరాకి ఆయుధ పూజ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అనీల్ రావిపూడి-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫస్ట్ సినిమా ‘భగవంత్ కేసరి’ దసరా సీజన్ ని టర్గెట్ చేస్తూ షూటింగ్ జరుపుకుంటుంది. అనీల్ రావిపూడి తెలంగాణా యాసలో బాలయ్య మాట్లాడించనున్న ఈ మూవీపై ఇప్పటికే భారి అంచనాలు ఉన్నాయి, వీటిని మరింత పెంచుతూ మేకర్స్ సాలిడ్ టీజర్ ని బయటకి వదిలారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతారంలో కనిపించాడు. తెలంగాణలో బాలయ్య డైలాగ్స్ చెప్తుంటే నందమూరి ఫాన్స్ లో కొత్త జోష్ వచ్చింది. బాలయ్య మార్క్ హీరోయిజం చూపిస్తూనే తన మార్క్ ఫన్ ఉండేలా జాగ్రత్త పడుతున్న అనిల్ రావిపూడి, భగవంత్ కేసరి టీజర్ తో అందరినీ మెప్పించాడు.

ట్రైలర్ కూడా ఇదే రేంజులో బయటకి వస్తే భగవంత్ కేసరి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలని అందుకోవడానికి సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి అండ్ టీమ్ శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. జనరల్ గా డబుల్ కాల్ షీట్ పేమెంట్స్ ఉంటాయని ఆదివారం షూటింగ్స్ జరగవు, దాన్ని కూడా కన్సిడర్ చేయకుండా భగవంత్ కేసరి షూటింగ్ చేస్తున్నారు. ఇదే జోష్ లో షూటింగ్ కి ఎండ్ కార్డ్ వేసి ప్రమోషన్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేయాలనేది మేకర్స్ ప్లాన్. భగవంత్ కేసరి షూటింగ్ అయిపోగానే బాలయ్య, డైరెక్టర్ బాబీతో అనౌన్స్ చేసిన సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. ఈ మూవీ బాలయ్య కెరీర్ లోనే చాలా స్పెషల్ గా మలిచాడట బాబీ. మరి అంత స్పెషల్ గా ఏం ప్లాన్ చేసాడో చూడాలి.

Exit mobile version